సమ్మర్ వచ్చిందంటే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. మండే ఎండలు ఒకవైపు భయవైపు పెట్టిస్తుంటే మరోవైపు ఉక్కపోత చిరాకు తెప్పిస్తుంటుంది. ఇక వేడిగాలుల సంగతి సరేసరి. వాటి వలన చాలా మంది వడదెబ్బకు గురవుతుంటారు. మరోవైపు సమ్మర్లో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు చనిపోవడం వలన తరచు ఫ్లూ, జ్వరాలు వస్తుంటాయి. శరీరంలో ఉండే కాలరీస్ పూర్తిగా ఖర్చు అవుతుండడం ఆందోళన కూడా కలిగిస్తుంటుంది. మరి ఈ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
ఎండ వేడిమి వలన మన శరీరంలో ఉండే పొటాషియం, సోడియం నిల్వలు తగ్గిపోతాయి. కాబట్టి ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలలో తిరగకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఒకవేళ తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే తరచు నీరు తాగేలా చూసుకోండి. ఎందుకంటే అధిక వేడి వలన మన బాడీ త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటుంది. కాబట్టి నీటితో పాటు తరచు కొబ్బరి బొండాం నీళ్లు, నిమ్మ రసం, పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి, చెరకు రసం వంటి ద్రవాలు తీసుకోవాలి. బాడీలో నుండి ఉప్పు చెమట రూపంలో బయటకు పోకుండా జాగ్రత్త పడాలి. నాలుక తడి ఆరిపోతుంటే వెంటనే నీటిని తాగాలి.
బయట తిరగాల్సి వస్తే ఖాళీ కడుపుతో బయట తిరగొద్దు. ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటూ మసాలాలు, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఎక్కువగా తీసుకోవద్దు. ఇక దుస్తుల విషయానికి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. సన్ గ్లాస్ వాడడం, సన్ స్క్రీన్ రాసుకోవడం, తలకు టోపీ పెట్టుకోవడం లేదంటే గొడుగు వాడడం వంటివి చేయాలి. గొడుగు పట్టుకొని ఎండలో తిరగాలంటే కొందరు నామోషీ ఫీలవుతారు. కాని ఆరోగ్యం విషయంలో ఎలాంటి మొహమాటలాలకు పోవద్దు. బయట తిరిగి వచ్చి వెంటనే ఎసీ రూంకు వెళ్లవద్దు. దాని వలన మీకు జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.ఏసీ ఎక్కువగా వాడడం వల న పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వారు ఏది తిన్నా కూడా అరగదు.ఫుడ్, డైట్ విషయంలో మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్తత్తలు సమ్మర్లో పాటిస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది.