Tomato : ముఖంలో నిగారింపు రావాలంటే టమోటోతో ఇలా చేయండి…!
NQ Staff - August 24, 2022 / 09:02 AM IST

Tomato : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం ఇంటి చిట్కాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా టమాటాని ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది.

Do this with tomato to get a smooth face
ఎన్నో ఉపయోగాలు..
చాలా మంది సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు మేకప్ వేసుకున్నా లేదా మార్కెట్లో లభించే చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడినా అది వారికి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అది మీ చర్మానికి సరిపోకపోవచ్చు. ఈ కారణంగా మీ చర్మం మంటగా ఉంటుంది. అలాంటి వారు టోమాటో గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. టొమాటోలో బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్లు సి, ఇ వంటి అనేక యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి చర్మంపై చల్లటి ప్రభావాన్ని కలిగిస్తాయి. సహజంగా నిగారింపును అందిస్తాయి.
మీది ఆయిలీ స్కిన్ అయితే టొమాటోను ముఖంపై రుద్ధండి. ఐదు, పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. దీంతో జిడ్డు పోవటమే కాకుండా మీ చర్మం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా గంధపు పొడి వేసి, నిమ్మరసం, టమోటా రసం కలపండి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ చర్మం తెల్లగా, యవ్వనంగా కనిపిస్తుంది.
టొమాటోలోని గుణాలు మీ చర్మంపై సన్ టాన్‌ను తొలగించి టోన్డ్, ప్రకాశవంతమైన ఛాయను అందించడంలో మీకు సహాయపడతాయి. సన్‌టాన్‌ను వదిలించుకోవడానికి మీరు టొమాటోను పెరుగు, నిమ్మరసం కలిపి మాస్క్‌ను సిద్ధం చేసుకోవాలి.2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.
ఈ మిశ్రమాన్ని మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై సమానంగా వర్తించండి. దీన్ని 15-20 నిమిషాల వరకు ఉంచుకొని, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది టాన్‌ను తగ్గించడమే కాకుండా సూర్యుని UV కిరణాల వల్ల కలిగే నిర్జీవత్వాన్ని తొలగిస్తుంది. దీంతో మీ చర్మం కాంతివంతగా మెరుస్తుంది.