Curd : పెరుగుతో క‌లిపి వాటిని అస్స‌లు తిన‌కూడ‌దు.. అవేంటో తెలుసా?

NQ Staff - August 12, 2022 / 11:45 PM IST

Curd  : పెరుగుతో క‌లిపి వాటిని అస్స‌లు తిన‌కూడ‌దు.. అవేంటో తెలుసా?

Curd  : పెరుగుని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పెరుగు వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. పెరుగు జీర్ణక్రియను పెంచడమే కాక శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి 2, విటమిన్ బి 12, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇవి అస్స‌లు చేయ‌కండి..

అయితే పెరుగుతో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినడం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగును ఉల్లిపాయతో కలిపి తీసుకోవడం అలవాటు. ఇలా చేయడం వల్ల మంచి రుచి వస్తుంది కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. ఉల్లిపాయ ప్రభావం వేడిగా ఉంటుంది. దీంతో పెరుగు, ఉల్లిని కలిపి తీసుకోవడం వల్ల మీకు అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Eating Certain Foods with Curd is Dangerous

Eating Certain Foods with Curd is Dangerous

పాలు మరియు పెరుగును కలిసి తినడం వల్ల అతిసారం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పెరుగు, మామిడిని కలిపి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇలా తింటే చర్మ సంబంధిత వ్యాధి వస్తుంది. మన జీర్ణక్రియలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి.

పెరుగుతో చేపలు తినకూడాదని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ప్రోటీన్ లు అధికంగా ఉండే రెండు ఆహారాలను తినకూడదు. ఇలా తింటే అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us