Coriander : కొత్తిమీర ఉప‌యోగాలు తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!

NQ Staff - July 24, 2022 / 03:53 PM IST

Coriander  : కొత్తిమీర ఉప‌యోగాలు తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!

Coriander  : సాధార‌ణంగా చాలా మంది కొత్తిమీర‌ని ప్ర‌తి కూర‌లో వాడుతారు. కొత్తి మీర అంటే కేవలం రుచి, వాసన పెంచడానికి ఉపయోగిస్తారని భావిస్తారు. అయితే, కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారమైనా, శాఖాహారమైనా కొత్తిమీర ఉండాల్సిందే. ఇది వంటలకి అదనపు రుచిని అందిస్తుంది.

లాభాలెన్నో…

రోజువారీ ఆహారంలో కొత్తిమీర తీసుకుంటే చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. ఆయుర్వేదం ప్రకారం కొత్తి మీర ఔషధ గుణాలని కలిగి ఉంటుంది. కొత్తిమీరలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు విటమిన్‌ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇందులోని యాంటీ బయోటిక్‌ మూలకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి.

Coriander Has Many Health Benefits

Coriander Has Many Health Benefits

కొత్తిమీర ఆకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఈ ఆకు కంటి చూపును పెంచుతుంది. అలాగే కంటి నొప్పి సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి కొత్తిమీరను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.

కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి వారం రోజులపాటు పరగడుపున తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్‌ యాసిడ్స్‌ కొత్తిమీరలో ఉంటాయి. ఇవి గుండె సమస్యల ముప్పుని తగ్గిస్తాయి.

Coriander Has Many Health Benefits

Coriander Has Many Health Benefits

ప్రతిరోజు కొత్తిమీర వాడటం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేగాక ఇందులో ఉండే యాంటీ పాస్మోడిక్‌ గుణాల వల్ల కాలేయం పనితీరుని బాగుచేస్తుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్తిమీర శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us