Cluster Beans : గోరు చిక్కుడు వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా?

NQ Staff - July 21, 2022 / 03:23 PM IST

Cluster Beans  : గోరు చిక్కుడు వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా?

Cluster Beans  : మ‌న‌కు విరివిగా దొరికే కూర‌గాయ‌ల‌లో గోరు చిక్కుడు ఒక‌టి. చాలా మంది గోరు చిక్కుడును ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోరు చిక్కుడు కాయ ఫ్రైలో చారు వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు. కేవలం రుచికి మాత్రమే పరిమితమైపోలేదు మన గోకరకాయ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తనలో ఇముడ్చుకుంది కూడా. సాధారణంగా భారత్‌లోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో, పాకిస్తాన్‌లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది.

మంచి ఉప‌యోగం..

Cluster Beans Are Rich in Proteins

Cluster Beans Are Rich in Proteins

దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు రోజువారీ ఆహారంలో దీనిని తీసుకుంటే మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. గోరు చిక్కుడును వృక్షశాస్త్ర పరంగా ‘చ్యమొప్సిస్ తెత్రగొనొలబ’ అని పిలుస్తారు. దీనిలో కేలరీల కంటెంట్ తక్కువగా మరియు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. క్రమంగా కేలరీలు తగ్గించడం ద్వారా అనవసరమైన బరువు తొలగింపుకు చాలా సహాయపడుతుంది.

మీకు రక్తహీనత సమస్య ఉంటే,రక్తహీనత వదిలించుకోవటం కొరకు ఉత్తమ చికిత్సలలో ఒకటిగా ఉన్నది. శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ చంపడం ద్వారా క్యాన్సర్ సంబంధిత సమస్యలు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యాన్ని ఫీట్ గా ఉంచటానికి ప్రోటీన్లు,విటమిన్లు,కార్బోహైడ్రేట్లు,ఖనిజాలు మరియు కరిగే ఫైబర్స్ సమృద్దిగా ఉంటాయి.

Cluster Beans Are Rich in Proteins

Cluster Beans Are Rich in Proteins

గర్భిణీలకు గోరుచిక్కడు కాయ మంచి ఆహారం. పిండం సాధారణ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. గోరుచిక్కుడు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ చంపుతుంది. ఫ్రీరాడికల్స్‌ ఎక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఫైబర్‌ను కలిగి ఉంటుంది. గోరుచిక్కుడు కాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయ పడుతుంది. గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గోరు చిక్కుడులో ప్రొటీన్లు అధికం. స్వ‌ల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఉంటాయి. విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటివి గోరు చిక్కుడులో ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలను గోరు చిక్కుడు కలిగి ఉంటుంది.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us