Health Tips : తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే చాలా ప్రమాదం.. ఈ రోగాలు రావడం ఖాయం..!

NQ Staff - December 6, 2023 / 01:18 PM IST

Health Tips : తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే చాలా ప్రమాదం.. ఈ రోగాలు రావడం ఖాయం..!

Health Tips :

మనం అందరం తరచూ ఉల్లిగడ్డలు కోసుకుని కూరలో వేసుకుంటాం. ఇది మనకు అలవాటే. ఉల్లిపాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మన ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఇవాళ రేపు అందరి ఇంట్లో  ఉంటుంది. ఫ్రిడ్జ్ తో కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆహారాలు పాడైపోకుండా ఉండటం కోసం మనం ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. చాలామంది రెండు మూడు రోజులైనా సరే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లోపెట్టుకుని తినేస్తారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొందరు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఇది కూడా అస్సలు మంచిది కాదు.

ఆహారాలను ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు ఉండదు. దాంతో పాటు ఇలాంటి వాటిలో ఉల్లిపాయలు కూడా ఉంటాయి. ఉల్లిపాయలను కూడా కూరలోకి తరిగిన తర్వాత ఎక్కువగా ఉన్నాయని కొందరు ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేసుకుంటారు. తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషక విలువలు తగ్గుతాయి

ఉల్లిపాయల్లో ఎన్నో మంచి ఔషధ లక్షణాలు ఉంటాయి. దాంతో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి. కోసుకున్న ఉల్లిపాయల్లో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అవి చాలా మెత్తగా మారిపోతాయి. ఇలా తేమకు గురైన ఉల్లిపాలయను తింటే అవి చెడు బ్యాక్టీరియాకు దారి తీస్తాయి. దాంతో మనకు జీర్ణ సంబంధిత సమస్యలు రావడం ఖాయం. పైగా ఉల్లిపాయలను ఇలా ఫ్రిడ్జ్ లో రెండు రోజులు పెట్టుకుంటే అందులో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. దాంతో పాటు ఇలా ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు పెట్టుకుని వండుకుంటే ఆహారం చెడు వాసన వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

సంక్రమణ

తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చెడు బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దాంతో పాటు ఫ్రిడ్జ్ లో తరిగిన ఉల్లిపాయలను పెడితే మాత్రం వాటి ద్వారా దుర్వాసన వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ వాసన ఫ్రిడ్జ్ లో ఉండే మిగతా ఆహార పదార్థాలకు కూడా చేరుతుంది. దాంతో వాటికి కూడా సదరు చెడు బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది.

ఉల్లిపాయల పొట్టు తీయకండి

చాలామందికి ఉల్లిపాయలను పొట్టిఉ తీసి కోయడం చాలా అలవాటు. ఇలా పొట్టు తీయడం వల్ల మరో ప్రమాదం కూడా వచ్చే అవకావం లేకపోలేదు. ఉల్లిపొట్టును తీసేస్తే అందులో ఉంటే ఎన్నో రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి చెడు బ్యాక్టీరియాను ఆకర్షించే పోషకాలుగా మారి ఆ బ్యాడ్ బ్యాక్టీరియాను పెంచేలా తయారవుతాయి. కాబట్టి ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ఉత్తమ మార్గం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us