Connect with us

Latest News

పార్టీ పతనమవుతున్నా కూడా చంద్రబాబులో ధీమా తగ్గటం లేదు కారణం ఏంటి?

Published

on

NEW TDP Leaders
Share the News from here

ఏపీలో టీడీపీ యొక్క పరిస్థితి ఎంత. దయనీయంగా ఉందొ అందరికి తెలుసు. ఎన్నికల్లో వైసీపీ నాయకులు కొట్టిన దెబ్బకు టీడీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఇంకా కొలుకోలేదు. పార్టీ దాదాపు తెలంగాణలో లాగా పతనంకు చేరువలో ఉంది. నిరుత్సాహంలో ఉన్న పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సహం నింపడానికి పార్టీ యొక్క నాయకత్వాన్ని కూడా మార్చడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ ఇంత పతన స్థాయికి చేరుకున్నా కూడా చంద్రబాబు నాయుడుతో మాత్రం ఎలాంటి భయం లేదు, పైగా ఇంకా ధీమాగా కనిపిస్తున్నారు. ఈ ధీమాకు గల కారణాలు ఏంటని వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.

చంద్రబాబులో కనిపిస్తున్న ధీమాకు కారణం ప్రాంతీయ పార్టీలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా గట్టుకొని 2024 ఎన్నికల్లో జగన్ ఓడించడానికి పతకం రచిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే బీజేపీకి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు . అవకాశం దొరికిన ప్రతిసారి ప్రధాని మోదీని పొగుడుతున్నారు. అలాగే సీపీఐ, సీపీఎం,కాంగ్రెస్ లతో కూడా జత కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. బీజేపీకి దగ్గరైతే ఎలాగో జనసేన కూడా కలిసి రావాల్సిందే. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా ఒంటరిగా గెలవలేదు. అందుకే 2024లో కూడా పొత్తులు పెట్టుకొని గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!