Connect with us

Latest News

తెలంగాణ మహిళామణులకు శుభవార్త తెలిపిన సర్కార్

Published

on

Share the News from here

తెలంగాణ మహిళామణులకు సర్కార్ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో బతుకమ్మ పండగ గురించి చెప్పడం అవసరం లేదు. ప్రతి ఏడాది బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా జరుపుతుంది. ఇక ప్రతి సంవత్సరం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణి చేస్తుంది సర్కార్. ఇక ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణి చేయనుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ చీరాల పంపిణీకి మాత్రం వెనుకడుకు వేయలేదు సర్కార్.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఈ కానుక ఇవ్వనున్నారు. ఈ చీరలను మొత్తం 287 డిజైన్లలో మగ్గాలపై తయారు చేసారు. అలాగే ఈ చీరల తయారీకి సర్కార్ 317 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి సారి లాగానే ఈ ఏడాది కూడా రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేయనున్నారు. ఇక ఈ చీరలను సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లో మరమగ్గాల పై తెలంగాణ సర్కార్ తయారు చేయించింది. ఇక ఇప్పటికే అన్ని జిల్లాలకు ఈ చీరలు చేరుకున్నాయి.

Do NOT follow this link or you will be banned from the site!