Connect with us

Entertainment

తొందరగా వెళ్లి అవుట్ అవడంలో తప్పు లేదు : ధోని 7వ స్థానం పై గంభీర్ చురకలు

Published

on

Share the News from here

ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నిన్న చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పరాజయం చెందింది. అయితే చెన్నై ఆటతీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల్లో భాగంగా సీనియర్ ఇండియన్ ప్లేయర్ గౌతమ్ గంబీర్ చెన్నై కెప్టెన్ ధోనీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాడు. అయితే అంత భారీ టార్గెట్ ఉన్నప్పుడే కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో ఎలా వస్తాడని.. బ్యాటింగ్ ‌లో కాస్త ముందు దిగితేనే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఇక ధోని కంటే ముందు ఆడిన శామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ ‌ను పంపించడమేంటని ప్రశ్నించారు. జట్టులో రైనా లేనందున ఆతడి స్థానంలో ధోనీనే వెళ్లాల్సి ఉండేదని అన్నారు. అయితే మొదట్లో నెమ్మదిగా ఆడి.. చివర్లో మూడు సిక్స్‌లు బాదినంత మాత్రాన ఎలా ఉపయోగం లేదని గంభీర్ విమర్శించారు. ధోనీ ఏడో స్థానంతో బ్యాటింగ్‌కు రావడం చూసి నేను ఆశ్చర్యపోయా అని గంబీర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

Do NOT follow this link or you will be banned from the site!