Tamannaah: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో త‌మ‌న్నా స్టైలిష్ లుక్ అదుర్స్

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా టైం న‌డుస్తుంది.ఒక‌వైపు సినిమాల‌తో సక్సెస్‌లు అందుకుంటున్న త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలోను అద‌ర‌గొడుతుంది. త‌మన్నా ప్రస్తుతం బిజీయెస్ట్ ఆర్టిస్ట్. హీరోయిన్‌గా, నటిగా, హోస్ట్ గా తీరిక లేకుండా గడుపుతోంది. అదే సమయంలో హాట్‌ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేస్తుంది.

నటిగా ఎంతగా అదరగొట్టినా, గ్లామర్‌ హీరోయిన్‌గా అంతకంటే క్రేజ్‌ తమన్నా సొంతం. ఈ అమ్మ‌డు అంద‌రి హీరోల‌కి బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు ఇంకోవైపు యాడ్స్‌ల‌లో న‌టిస్తూ త‌మన్నా ర‌చ్చ చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ స్పెషల్‌ సాంగ్‌ల కోసం తమన్నాని అప్రోచ్‌ అవుతున్నారు మేకర్స్.

ప్రస్తుతం తమన్నా తెలుగులో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `ఎఫ్‌3`, `సీటీమార్‌`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో `సీటీమార్‌` , మ్యాస్ట్రొ చిత్రాలు విడుద‌లై పెద్ద విజ‌యాలు సాధించాయి. మ‌రో వైపు జెమినీ టీవీలో `మాస్టర్‌చెఫ్‌తెలుగు` అనే వంటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

మాస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మం కోసం త‌మ‌న్నా వెరైటీ డ్రెస్‌ల‌లో మెరుస్తుంది. ఇందుకోసం తమన్నా నిర్వహించే షూట్లు, ఫోటో షూట్ల చేస్తుండ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.