Deepika Pilli: దీపికా పిల్లి.. తన అందాలతో లొల్లి జేస్తుందిగా..

Deepika Pilli: తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ల మధ్య చాలా పోటీ నెలకొంది. రోజు రోజుకి కొత్త యాంకర్స్ పుట్టుకొస్తుండడంతో పాత యాంకర్స్ తన స్థానాలు పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్త యాంకర్స్ అయితే పాదరసంలా మెల్లగా పాకుతున్నారు. ఇప్పడిప్పుడే ఎదుగుతున్న దీపికా పిల్లి కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.

యాంకరింగ్‌పై పట్టు పెంచుకుంటున్న ఈ అమ్మాయి.. అందం విషయంలో మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది. డ్యాన్స్ లతో పాపులారిటీ దీపికా పిల్లి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లు టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు.

ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటను చాల మంది తమ డ్యాన్సలతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా ఇలా వీడియో చేసి పోస్ట్ చేసింది. గుడిలో ఎంతో అందంగా చేసిన ఈ డ్యాన్స్ కి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులవుతున్నారు.

దీపికా ఎప్పటికప్పుడు తన అందాలతో లొల్లి జేస్తుంటుంది. స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈ అందాల ముద్దుగుమ్మలు చేసే రచ్చ ప్రతి ఒక్కరికి కేక పెట్టిస్తుంది.