Actress Purna : నటి పూర్ణ సీమంతం వేడుక.. పిక్స్ వైరల్..!
NQ Staff - January 30, 2023 / 12:22 PM IST

Actress Purna : సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ ఇట్టే వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి పూర్ణకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Actress Purna Seemantam Celebration Photos
ముఖ్యంగా అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Actress Purna Seemantam Celebration Photos
కానీ చేసిన వాటిల్లో ఎక్కువగా హర్రర్ సినిమాఏ ఉండటంతో ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. కానీ చాలానే సినిమాల్లో నటించింది.

Actress Purna Seemantam Celebration Photos
ఆయనతో పెండ్లి..
మొన్నటి వరకు బుల్లితెరపై కూడా హంగామా చేసింది. ఢీషోలో, ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేసింది.

Actress Purna Seemantam Celebration Photos
ఈ క్రమంలోనే ఆమె దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీని పెండ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది.

Actress Purna Seemantam Celebration Photos
ఇక తాజాగా ఆమెకు సీమంతం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

Actress Purna Seemantam Celebration Photos
కాగా ఈ సీమంతం వేడుకలకు సినీ సెలబ్రిటీలు ఎవరూ హాజరు కాలేదు. తమ కుటుంబ సభ్యుల మద్యనే ఆమె గ్రాండ్ గా చేసుకుంది.