Connect with us

Latest News

మాజీ రాష్ట్రపతి పరిస్థితి విషమం

Published

on

Share the News from here

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆయనకు క్లిష్టమైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చింది.

ఆసుపత్రిలో చేరేనాటికి తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా తనతో సన్నిహితంగా ఉన్నవారిని పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ తొందరగా కోలుకొని మాములు స్థితికి రావాలని ఆయన ప్రార్ధించాడు.

Do NOT follow this link or you will be banned from the site!