Connect with us

Latest News

అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం, సమీపంలోనే బిగ్ బాస్ హౌస్

Published

on

Share the News from here

అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ రోజు ఉదయం చిన్నగా మంటలు అలుముకున్నాయి. దీనితో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ లో సీరియళ్లు, సినిమాలు, రియాలిటీ షోల షూటింగులు జరుగుతున్నాయి.

ఇక ఈ సమయంలో ఒక షో కోసం వేసిన సెట్ లో షాట్ సర్క్యూట్ అయింది. దీనితో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద స్థలానికి సమీప దూరంలో బిగ్ బాస్ హౌస్ ఉంది. దీనితో బిగ్ బాస్ టీం కాస్త ఊపిరి పిలిచుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తమ విచారణలో వెల్లడించారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!