YS Sharmila : వైఎస్ షర్మిల బ్లాక్ మెయిల్ రాజకీయాలు

YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకి తెరలేపారు. సర్కార్ అంటే తను చెప్పింది చేసే సర్వర్ అనుకుంటున్నట్లున్నారు. పోలీసులంటే తన ప్రైవేట్ సెక్యూరిటీలా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నమెంట్ అన్నాక కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరైనా వాటిని పాటించాల్సిందే. వైఎస్ కూతురు అయితే మాత్రం తాను ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదు. ఇది తన ‘లోటస్’ పాండ్ ఇల్లు కాదు. గులాబీ పువ్వు వికసించిన తెలంగాణ రాష్ట్రం. షర్మిలను అరెస్టు చేస్తున్న క్రమంలోనో లేక మరెక్కడో ఆమె చేతికి గాయం అయిందట. ఇంకోసారి తనపై చెయ్యి పడితే ఊరుకోను అంటూ పులివెందుల తరహా ఫ్యాక్షన్ పొలిటికల్ డైలాగులు వదిలారు. అరెస్ట్ చేసిన తన కార్యకర్తలని వదిలిపెట్టే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతిన బూనారు. పట్టుదల ఉండొచ్చు. మంకి పట్టు పట్టకూడదు.

YS Sharmila : ys sharmila black mail politics
YS Sharmila : ys sharmila black mail politics

ఏదో ఒక రోజు సీఎం..

తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని షర్మిల (అతి)విశ్వాసం వెలిబుచ్చారు. బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సర్కారు కొలువుల భర్తీకి చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో వరుసగా ఎలక్షన్ కోడ్ వస్తుండటం వల్లేమో జాబ్ నోటిఫికేషన్ల విడుదలకు వెనకడుగు వేస్తోంది. అవన్నీ అర్థంచేసుకోకుండా ‘‘నేను దీక్షకు దిగుతున్నా. కొలువులకు ప్రకటనలు ఇచ్చే వరకు విరమించను. నాకు నచ్చినన్ని రోజులు దీక్ష చేస్తా’’ అంటే కుదరదు అని విమర్శకులు సూచిస్తున్నారు.

అసలే కరోనా: YS Sharmila

ఒక వైపు రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. షర్మిల ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తానంటే ఒక రోజు పర్మిషన్ ఇచ్చింది. దాన్ని అలుసుగా తీసుకొని, కొవిడ్-19 వ్యాప్తిని పట్టించుకోకుండా రోజుల తరబడి రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తాననటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ముందు లేడీస్ సెంటిమెంట్ నడవదనే సంగతిని షర్మిల గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

విజయమ్మ హెచ్చరికలు..

షర్మిల శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులే దౌర్జన్యం చేశారని ఆమె తల్లి విజయమ్మ విమర్శించారు. షర్మిల దీక్షని ప్రభుత్వం గౌరవిస్తే ప్రభుత్వానికి కూడా గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు మరింత పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. షర్మిల తెలంగాణ ప్రజల కోసం నిలబడిందని విజయమ్మ చెప్పారు.

Advertisement