YS Sharmila : షర్మిల పార్టీ.. తెలంగాణకేంటి?..

YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వందకు నూట యాభై శాతం ఖాయం. అయితే, ఆమె వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేదేంటి? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని పంచాయతీలు కొనసాగుతున్నాయి. వాటిని వైఎస్ షర్మిల తీరుస్తారా అని ఇక్కడివాళ్లు అడుగుతున్నారు. తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు తనకు ‘‘ఉన్నాయని భావిస్తున్నా’’ అన్నారే గానీ ‘‘ఉన్నాయి’’ అని ఆమె కచ్చితంగా చెప్పలేదు. అసలు షర్మిల తన సోదరుడి పేరే ఎత్తట్లేదు. ఆయన ఫొటోనే పెట్టట్లేదు.

రానున్న రోజుల్లో..

మన కుటుంబంలో మనం మనం తిట్టుకున్నా కొట్టుకున్న ఓకే. కానీ బయటివాడు మన మీదికి వస్తే ఊరుకోం కదా. అలాగే.. సోదరుడి పేరు, ఫొటో విషయాల్లో ఇంత కచ్చితంగా ఉంటున్న షర్మిల రేపు పార్టీ పెట్టాక వేరేవాళ్లు జగన్ ని టార్గెట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇతరులు తన బ్రదర్ ని విమర్శిస్తే ఆమె ఎవరి వైపు ఉంటారో. అన్నని మాట అననీయని పరిస్థితే వస్తే అప్పుడు షర్మిల తెలంగాణను పూర్తిగా ఓన్, క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు. మెట్టింటివాళ్లు పుట్టింటి వాళ్లను పల్లెత్తు మాటన్నా పడనీయకపోవటం సగటు తెలుగు కోడలి సహజ మనస్తత్వం.

ఇద్దరికీ: YS Sharmila

తెలంగాణ ప్రయోజనాల కోసం షర్మిల తనకుతానుగా తన అన్న జగన్ ని తప్పు పట్టగలదా? నీటి పంపకాల వ్యవహారంలో నిలదీయగలదా? అటు నుంచి ఆన్సర్ రాబట్టగలదా? ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణ కోసం ఏపీ ప్రభుత్వాన్ని, నేరుగా సోదరుడు జగన్ ని సాధించగలదా? ఇవేవీ చేయలేకపోతే ఆమె పార్టీ తెలంగాణలో మనుగడ సాగించటం కష్టం. సాటి తెలుగు రాష్ట్రం కదా అని సాఫ్ట్ గా ఉంటానంటే లోకల్ సెంటిమెంట్ ముందు నడవదు. ఈ పరిస్థితి రాజన్న బిడ్డలకు రాజకీయంగా ఇబ్బందికరమే. ఎవరు రాజీపడతారో కాలమే సమాధానం చెప్పాలి.

YS Sharmila : what-is-the-benefit-to-telangana-with-ys-sharmila-party
YS Sharmila : what-is-the-benefit-to-telangana-with-ys-sharmila-party

తండ్రికి..

ఇప్పటివరకైతే తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. మహానేత చనిపోయాడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు పొలిటికల్ గా గానీ మరేరకంగానైనా విమర్శించటం పద్ధతి కాదననే సంయమనాన్ని ఇక్కడివాళ్లు పాటిస్తున్నారు. కానీ, భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని చెప్పలేం. తెలంగాణలోని కొందరు నాయకులు ఆవేశంలోనో, ఫ్రస్టేషన్ లోనో, సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయటానికో వైఎస్ఆర్ పై నోరు పారేసుకోవచ్చు. నానా మాటలూ అనొచ్చు. ఫలితంగా షర్మిల అనవసరంగా వచ్చి తన తండ్రికి తలవంపులు తెచ్చారనే చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సివస్తుందేమో. ఫైనల్ గా వైఎస్ షర్మిల పార్టీ వల్ల తెలంగాణకు ఏంటి అనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు.

Advertisement