YS Sharmila : షర్మిల సమావేశం.. షాకింగ్ సన్నివేశం..

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో రెగ్యులర్ గా మీటింగులు పెడుతున్నారు. ఈ రోజు (శనివారం) హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని మాత్రమే ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ‘‘జై తెలంగాణ’’ అని అనలేదు. కానీ.. ఇవాళ ఆ మాటను ఒకటికి రెండు సార్లు పలికి మీటింగుకి వచ్చినవారిలో కొత్త ఉత్సహం నింపారు. తాను ఆంధ్రా మనిషినని దెప్పిపొడుస్తున్న ప్రత్యర్థులకు షాకిచ్చారు.

ఆ పార్టీపైనే..

తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆరెస్ ప్రధానంగా ప్రస్తావించే నినాదం ‘‘జై తెలంగాణ’’. ఎక్కడ మీటింగు జరిగినా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఈ మాటను అందరి చేతా అనిపిస్తారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును ఎప్పటికప్పుడు రగిలిస్తూ ఉంటారు. ఆ పాయింటును వైఎస్ షర్మిల పట్టేసుకున్నారు. తెలంగాణను ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరూ ఊహించని రీతిలో ‘‘జై తెలంగాణ’’ అనేశారు. దీంతో భేటీలో పాల్గొన్నవాళ్లంతా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఈ రాష్ట్రంలో తాను బలమైన ముద్ర వేయబోతున్నానని ఆమె చెప్పకనే చెప్పిందంటున్నారు. వైఎస్ షర్మిల ముఖ్యంగా టీఆరెస్ పార్టీనే టార్గెట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది.

YS Sharmila : shocking scene in ys sharmila meeting
YS Sharmila : shocking scene in ys sharmila meeting

ఒక్క దెబ్బకు: YS Sharmila

తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ ని రాజకీయంగా దెబ్బకొట్టాలంటే ప్రధానంగా రెండు అంశాలపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణ సెంటిమెంటును ఫాలో అవుతూనే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ మేరకు ఇప్పటికే షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. వాటితో పోల్చుతూ టీఆరెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుల గురించి లోతుగా తెలుసుకుంటున్నట్లు, అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. గుర్తింపునకు నోచుకోని ఉద్యమ వీరులను వెలుగులోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement