YS Sharmila : ‘‘అన్నకు తగ్గ చెల్లెలు’’.. అనిపించుకుంటుందా?..

YS Sharmila : అన్నకు ఏమాత్రం తగ్గకుండా, అన్న మాట అస్సలు లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. రాజకీయంలో ‘‘అన్నకు తగిన చెల్లెలు’’ అనిపించుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో గనక పార్టీ పెడితే సీఎం అయినా కాకపోయినా, కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా పార్టీ పెట్టీ పెట్టడంతోనే సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో 60 ఏళ్ల కిందట దళిత నాయకురాలు జెట్టి ఈశ్వరీబాయి(కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గీతారెడ్డి తల్లి) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ అధ్యక్షురాలిగా రాజకీయ పార్టీ పెట్టిన దాఖలా లేదనే చెప్పొచ్చు.

1969-70ల్లో..

1960ల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన ఈశ్వరీబాయి.. తర్వాత 1969-70ల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి దశలో సెపరేట్ తెలంగాణ పోరాట సమితి (ఎస్టీపీఎస్) పేరిట పొలిటికల్ పార్టీ పెట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీకి గౌరవ అధ్యక్షురాలు అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో మాజీ జర్నలిస్ట్ రాణి రుద్రమ.. యువ తెలంగాణ అనే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇంతేతప్ప ఈశ్వరీబాయి తర్వాత పూర్తిగా ప్రెసిడెంటుగా ఒక మహిళ పార్టీ పెట్టిన చరిత్ర లేదు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఆ లోటును భర్తీ చేసి నయా చరిత్రను నమోదు చేస్తారేమో చూడాలి.

YS Sharmila : can she proove as sister of ys jagan in terms of politics
YS Sharmila : can she proove as sister of ys jagan in terms of politics

నిలదొక్కుకోగలదా?: YS Sharmila

అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్సీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ఏకంగా పదేళ్లు పోరాటం చేశాక ముఖ్యమంత్రి అయ్యాడు. మధ్యలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆ సంగతి దేశంలోని అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ షర్మిలకు ఆ స్థాయి ఎదురుదెబ్బలు తగలకపోవచ్చు గానీ తెలంగాణను ఓన్ చేసుకోవటమే ప్రస్తుతం ఆమె ముందున్న అతిపెద్ద లక్ష్యం. అవినీతి, ఫ్యాక్షన్ అనే ముద్రల్ని చెరిపేసుకొని, బలమైన అపొజిషన్ లీడర్ గా నిరూపించుకొని ఆ తర్వాతే వైఎస్ జగన్ జననాయకుడయ్యాడు. వైఎస్ షర్మిల కూడా ఇదే రీతిలో ముందు ఒక ఎమ్మెల్యేగా, ‘‘పట్టు’’దల కలిగిన ప్రతిపక్ష నాయకురాలిగా రాణించాలి. అప్పుడు గానీ సీఎం కుర్చీపై ఆశ పెట్టుకోవచ్చు. అప్పటికీ అది అత్యాశే అవుతుందనుకోండి. అది వేరే విషయం.

Advertisement