బీజేపీ ఓటమికి సూపర్ స్కెచ్ వేసిన జగన్.. మోడీ నోట్లో వెలక్కాయ పడ్డట్టేనా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రముఖ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా మారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి రెడీ అయిపోయింది. జనసేన పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొని కేసీఆర్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూసింది కానీ బీజేపీ పార్టీ పెద్దలు పవన్ ని బతిమిలాడి మరీ పోటీ నుంచి వైదొలిగేలా చేశారు. ఐతే పవన్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తానని వెల్లడించారు. అనవసరంగా తాను పోటీ చేసి.. ఓట్లు చీలడానికి కారణం కాకూడదని పవన్ అనుకున్నారు. బీజేపీ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేయాలనే పవన్ కల్యాణ్ గ్రేటర్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు.

ys jagan master plan about bjp
ys jagan master plan about bjp

కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే టీఆర్ఎస్ కి గట్టిపోటీ ఇవ్వాలని తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. కానీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెరాస కి గట్టి పోటీ ఇవ్వలేవు. ప్రస్తుతానికి తెరాస పార్టీకి బీజేపీ మాత్రమే బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలనాత్మక విజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ పార్టీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపు సాధించి కేసీఆర్ రాజకీయ సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని చూస్తోంది. ఒక్క ఓటమి తోనే తెరాస పార్టీ గింజుకుంటుంది. మరోసారి కూడా ఓటమిని చవి చూస్తే ఇక కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం తద్యం.

పోరాడి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్.. ప్రజలను సక్రమంగా పరిపాలించడంలో మాత్రం విఫలం అయ్యారు. ఎన్నో హామీలను ఇచ్చారు కానీ వాటిలో ఒక్కటి కూడా సమర్థవంతంగా నెరవేర్చలేక పోయారు. ఈ వైఫల్యాలన్నీ టీఆర్ఎస్ పార్టీకి నష్టమే చేకూరుస్తాయి. మొన్నటికి మొన్న హైదరాబాదు రాష్ట్రంలో వరదలు వెల్లువెత్తుతే ప్రజలను కాపాడటానికి కూడా కేసీఆర్ సర్కార్ ముందుకు రాలేదు. భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫెయిల్యూర్ కి హైదరాబాద్ వరదలు అద్దం పట్టాయి. దీనితో అనేక ఇక్కట్లు పడ్డ ప్రజలు కేసీఆర్ పాలనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా బీజేపీ పార్టీకి ఓట్లు వేసే ఆస్కారం ఉంది.

కానీ బీజేపీ పార్టీని అణగదొక్కి.. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోవడానికి వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులోని భాగంగానే టీడీపీ పార్టీ పోటీ చేసినా కూడా వైసీపీ పోటీ చేయడానికి ఆసక్తి కనబరచలేదు. కేసీఆర్, జగన్ మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నట్టు బయటికి కనిపిస్తున్నా.. వాళ్ళిద్దరూ ఇప్పటికీ మంచి దోస్తులే. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీకి నో చెప్పి.. ఆంధ్ర ప్రదేశ్ సెటిలర్ల ఓట్లను చీల్చకుండా.. ఆ వోట్లు అన్నీ కూడా కేసీఆర్ కే వదిలేసారు. రెడ్డి సామాజిక వర్గం నేతలందరూ కేసీఆర్ కే ఓటు వేయవచ్చు. జగన్ కి వ్యతిరేకంగా ఉన్న వారందరూ టీడీపీ పార్టీకి ఓట్లు వేస్తే… మిగతా వారందరూ కూడా కేసీఆర్ కే ఓట్లు వేసే అవకాశం ఉంది.

ఒకవేళ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే దాని నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అవుతుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో కాషాయ దళం కి ప్రజాదరణ రాకూడదని బాగా కోరుకుంటున్నారు. లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌ల్లో వైసీపీ మద్దతును బీజేపీ తెలివిగా వాడుకుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయం అందించడం లేదు. సహాయం కోసం అడిగిన ప్రతిసారీ మొండిచెయ్యి చూపిస్తోంది. దీనితో జగన్ బీజేపీ పై పీకలదాకా కోపం పెంచుకున్నారు. అవసరం అయినప్పుడు కాళ్లావేళ్లా పడతారు కానీ ఏదైనా అవసరాలు తీర్చమన్నప్పుడు మాత్రం మొహం చాటేయడం లో మోడీ తరువాతనే ఎవరైనా అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విస్పష్టం అవుతూనే ఉంది. అందుకే బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగలాలని జగన్ కోరుకుంటున్నారు.

కేసీఆర్ కుర్చీ కిందకే నీళ్లు తెస్తున్న బీజేపీ పార్టీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయదన్న గ్యారెంటీ ఏముంది? దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని మోడీ ఎప్పటినుంచో తెగ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పైనే మోడీ కన్నేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఆ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కచ్చితంగా పడుతుంది. అందుకే జగన్ అన్నీ ఆలోచించి.. గ్రేటర్ ఎన్నికల్లో తాను సైడ్ అయిపోయి.. కేసీఆర్ గెలుపు కి దారి చూపిస్తూ బీజేపీ పార్టీ ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు.

Advertisement