కోహ్లీ ఇంట మహాలక్ష్మి, ఈసారి కప్ ఆర్సీబీదేనా?

Mamatha 600 - January 13, 2021 / 12:02 PM IST

కోహ్లీ ఇంట మహాలక్ష్మి, ఈసారి కప్ ఆర్సీబీదేనా?

ఆడపిల్ల అంటే ఇంటి మహాలక్ష్మి అని, అదృష్ట లక్ష్మి అని, ఇంటికి వెలుగు అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. అమ్మాయి పుడితే శాపంగా ఫీలయ్యే ఆడవాళ్ళున్న ఈ రోజుల్లో కూడా అమ్మాయి పుడితే పండుగలా సెలబ్రేట్ చేసుకునే తండ్రులు చాలా మంది ఉన్నారు. నిజానికి ఆడబిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువ శాతం మంది తండ్రులకు కలిసి వస్తుందని ఒక సెంటిమెంట్ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ఆర్ధికంగా గాని, కీర్తి పరంగా గాని అమ్మాయి పుట్టిన తర్వాత వస్తే తన కూతురికే క్రెడిట్ ఇచ్చే తండ్రులు ఉన్నారు.

MS-Dhoni-Gautam-Gambhir-and-Rohit-Sharma

వీళ్ళలానే క్రికెటర్స్ లో కూడా తమ కూతుర్లని అదృష్ట లక్ష్మిలుగా ఫీలయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ధోని, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ ఉన్నారు. 2015 ఫిబ్రవరి 6 న ధోని తండ్రి అయినరోజు. ఆ ఇంట్లో అదృష్ట లక్ష్మి పుట్టింది. పేరు జీవా. 2018 లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి, గెలిపించి, ఐపీఎల్ కప్ ను అందుకున్నారు. ఆ తర్వాత ఇదే సెంటిమెంట్ గౌతమ్ గంభీర్ విషయంలో కూడా వర్కవుట్ అయ్యింది. 2014 మే 1 న గంభీర్ ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. పేరు ఆజీన్ గంభీర్. ఈ బుడ్డది పుట్టిన వేళా విశేషమో ఏమో గాని కోల్కట నైట్ రైడర్స్ టీమ్ 2014 జూన్ 1 న ఐపిఎల్ కప్ ను గెలుచుకుంది.

హిట్ మ్యాన్ గా క్రేజ్ తెచ్చుకున్న రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ తరపున ఐపిఎల్ కప్ ను అందుకున్నారు. డిసెంబర్ 30న 2018 లో పాప పుట్టింది. పేరు సమీరా శర్మ. ఈ చిట్టితల్లి ఇలా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిందో లేదో 2019 లో రోహిత్ హిట్ మ్యాన్ లా విజృంభించారు. ముంబై ఇండియన్స్ టీమ్ ఐపిఎల్ కప్ ను ఎత్తుకునే విధంగా, టీమ్ ను మరోసారి తలెత్తుకునే విధంగా చేశారు. రోహిత్ కెప్టెన్సీలో ఈ టీమ్ ఐదుసార్లు కప్ గెలుచుకుంది. ఇలా ధోని, గంభీర్, రోహిత్ శర్మలు ఆడపిల్లలు పుట్టిన కారణంగా ఐపిఎల్ కప్ ను లిఫ్ట్ చేశారని, విరాట్ కోహ్లీ కూడా 2021 ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ టీమ్ తరపున కప్ ఎత్తుకుంటారని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే కోహ్లీ, అనుష్క శర్మలకి కూడా బేబీ గర్ల్ పుట్టింది. 2021 జనవరి 11 న కోహ్లీ ఇంట మహాలక్ష్మి పుట్టింది. దీంతో అభిమానులు లక్కీ బేబీ పుట్టిందని, ఇప్పటి వరకూ ఒక్క ఐపిఎల్ కప్ ను గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ 2021 ఐపిఎల్ సీజన్ లో ఖచ్చితంగా కప్ కొడుతుందని, రాసి పెట్టుకోండి అంటూ అభిమానులు మీమ్స్ ని వైరల్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఒకవేళ వర్కవుట్ అయితే నిజంగా ఈ లక్కీ బేబీస్ లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టే..

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us