TRS : టీఆరెస్ లో ఎల్లుండు ఏం జరగబోతోంది?..

TRS : తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆరెస్ లో ఎల్లుండు ఏడో తారీఖు ఆదివారం ఏం జరగబోతోందనే ఆసక్తి, ఉఠ్కంత సర్వత్రా నెలకొంది. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసు ‘తెలంగాణ భవన్’లో పెద్ద మీటింగ్ ఏర్పాటుచేశారు. దీనికి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. గులాబీ పార్టీ ఇటీవల ఇంత భారీ సమావేశాన్ని ఎప్పుడూ పెట్టలేదు.

అందరూ..

ఈ భేటీలో టీఆరెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, లోక్ సభ-రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టేట్ లెవల్ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మునిసిపల్ మేయర్లు, డీసీసీబీ ప్రెసిడెంట్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్ని, పార్టీ అంతర్గత వ్యవహారాలను ఇందులో లోతుగా చర్చించనున్నారు.

ఆ రెండు: TRS

టీఆరెస్ లోపల, బయట రెండు ముఖ్యాంశాలు పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో ఒకటి.. ‘కేటీఆర్ సీఎం’. రెండు.. ‘బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్’. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎంని చేయాలని పార్టీలోని దాదాపు అన్ని శ్రేణులు కోరుకుంటున్నాయి. నేతలు రోజుకొకరు చొప్పున బయటపడుతున్నారు. అయితే, దీన్ని సమర్థిస్తూ గానీ ఖండిస్తూ గానీ అధిష్టానం నుంచి ప్రకటన రాలేదు.

ఆ రోజైనా..

మరో రెండు రోజుల్లో పార్టీ సర్వ సభ్య సమావేశం జరగబోతుండటంతో అందులోనైనా ‘కేటీఆర్ సీఎం’ అనే ప్రచారానికి తెర పడుతుందా లేదా అని టీఆరెస్ కార్యకర్తలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ మీటింగులో పార్టీ మెంబర్ షిప్పుల రెన్యువల్, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం, పార్టీ చీఫ్ ఎన్నిక, స్టేట్ లెవల్ ప్లీనరీ తదితర సంస్థాగత అంశాల్ని చర్చిస్తారని పేర్కొంటున్నారు.

TRS : what is going on in trs party day after tomorrow
TRS : what is going on in trs party day after tomorrow

క్లారిటీ: TRS

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆరెస్ పొలిటికల్ గా సైలెంట్ కావటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీకి లొంగిపోయారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. కేసీఆర్ పై కేసులు పెడతామని ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెదిరించటం వల్లే ఆయన మౌనంగా ఉండిపోతున్నారనే కౌంటర్లు, సెటైర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు కూడా కేబినెట్ లో కీలక పదవి దక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు కేటీఆర్ కి బదులు సీనియర్ మంత్రి ఈటలను సీఎంని చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైన చెప్పుకున్న అన్ని విషయాలపైనా పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.

Advertisement