TRS vs BJP : వాణీదేవి, రాంచందర్ రావు.. ఈ ఇద్దరిలో గెలుపెవరిది?

TRS vs BJP : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ తరఫున బరిలో నిలిచిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి, బీజేపీ అభ్యర్థి-సిట్టింగ్ ఎమ్మెల్సీ  రాంచందర్ రావు మధ్యే ప్రధాన పోటీ ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీళ్లిద్దరిలో ఎవరికుండే ప్లస్ పాయింట్లు వాళ్లకున్నాయి. రాంచందర్ రావు చానాళ్ల నుంచి పాలిటిక్స్ లో ఉండగా వాణీదేవి మాత్రం అనూహ్యంగా లేటెస్టుగా తెరపైకి వచ్చారు. అయితే ‘ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం’ అనే మాట ఆమెకు వర్తిస్తుంది.

ఎందుకంటే?..

ఈ ఎలక్షన్ జరుగుతున్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి. అంటే విద్యా రంగంపై అవగాహన ఉన్నవారికి సంబంధించింది. ఇది వాణీదేవికి తిరుగులేని కలిసొచ్చే అంశం. ఆమె 35 ఏళ్లుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సేవలందిస్తున్నారు. కాబట్టి ఆ రంగం పైన వాణీదేవికి సంపూర్ణ అవగాహన ఉందనటంలో ఎలాంటి అనుమానమూ లేదు. రాంచందర్ రావు వృత్తి రీత్యా న్యాయవాది. లీగల్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. గతంలో ఏబీవీపీలో పనిచేసినప్పటికీ ప్రొఫెషన్ పరంగా చూస్తే పట్టభద్రులకు సంబంధించిన పలు అంశాలపై వాణీదేవికున్నంత నాలెడ్జ్ రాంచందర్ రావుకు ఉండదనే చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పరిచయాలు: TRS vs BJP

రాంచందర్ రావు రాజకీయాల్లో సీనియర్ కావటం, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ అవటం ఆయనకి సానుకూల అంశాలు. రాంచందర్ రావు గత ఆరేళ్లుగా ఎమ్మెల్సీ గా ఉన్నా గ్రాడ్యుయేట్లకు చేసిందేమీ లేదంటూ పొలిటికల్ యాంగిల్ లో ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉండొచ్చు. కానీ, ఆయన అస్సలు ఏమీ చేయలేదనటం కూడా కరెక్ట్ కాదని, ఎంతో కొంత తనదైన ముద్ర వేసి ఉంటారని తటస్థులు చెబుతున్నారు. రాంచందర్ రావు ఒక శాసన మండలి సభ్యుడిగా, బీజేపీ లీడర్ గా విద్యా రంగానికి చేసిన సేవల కన్నా S. వాణీదేవిని బరిలోకి దింపిన టీఆరెస్ పార్టీ.. ప్రభుత్వపరంగా అమలు చేసిన పథకాల ప్రభావమే ఎక్కువ ఉంటుందని, అది ఆమెకు ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం చూపిస్తుందని పలువురు చెబుతున్నారు.

TRS vs BJP : vani devi, ramchander rao.. who will win in mlc election
TRS vs BJP : vani devi, ramchander rao.. who will win in mlc election

ఆ ఒక్క ఛాన్స్..

వాణీదేవి మొదటిసారి ఎమ్మెల్సీగా పోటీచేస్తున్నారు. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. విద్యా రంగంలో తాను గడించిన అనుభవం మొత్తం ఉపయోగించి, సీఏం కేసీఆర్ నాయకత్వంలో పట్టభద్రులకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నారు. రాంచందర్ రావు ఆల్రెడీ ఆరేళ్లు ఈ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకి రెండోసారి ఓటేయటం కన్నా వాణీదేవికి కూడా ఓసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమోనని గ్రాడ్యుయేట్లు అనుకుంటే అది రాంచందర్ రావు విజయావకాశాలపై దెబ్బకొట్టొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

Advertisement