TRS: టీఆర్ఎస్ పార్టీలో.. టోటల్ హ్యాపీ. ఈ ఒక్కటి తప్ప..

TRS: తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని వేరు చేసి చూడలేం. అది చాలా కష్టమైన పని. గడచిన 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ‘మన’ అనే భావోద్వేగాన్ని(సెంటిమెంట్ ని) పుట్టించి, పెంచి పోషించిన ఈ పొలిటికల్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజు సోమవారంతో 20 ఏళ్లు పూర్తవుతోంది. రేపు 21వ ఏట అడుగు పెడుతోంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు కేసీఆర్ ఒక్కడే. ఇప్పుడు ప్రతిఒక్కరూ కేసీఆరే. అంటే అందరూ ఆయన ఫ్యాన్సే అని అర్థం. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఇప్పుడు అధికార పార్టీగా కొనసాగుతోంది. అనుకున్నది సాధించి అంతటా సంతోషాన్ని నింపిన ఈ గులాబీ పార్టీకి ప్రస్తుతం ఒక్కటే అసంతృప్తి.

ఏంటది?..

పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నామన్నదే ఆ బాధ. ఈ ఒక్క ఏడాది కాదు. గత రెండేళ్లలో కూడా ఈ సెలబ్రేషన్స్ జరగలేదు. 2019లో లోక్ సభ ఎన్నికల హడివుడిలో పడిపోయి వేడుకలను నిర్వహించలేదు. 2020లో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా, ప్రస్తుతం కూడా అదే మహమ్మారి వల్ల టీఆర్ఎస్ ఫౌండేషన్ డే సంబరాలు జరిపే పరిస్థితి లేకుండాపోయింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ కొవిడ్-19 వైరస్ సోకడంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ప్లీనరీని ఏర్పాటుచేసే ఛాన్స్ లేకపోవటంతో పోయినేడాది పార్టీ అభిమానుల, కార్యకర్తల, నాయకుల, శ్రేణుల ఇళ్ల పైనే జెండాని ఎగురవేయగా ఈసారి సైతం అదే చేయాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ రూల్స్ ప్రకారం రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు.

మరో రెండు, మూడు సార్లు..

ఉద్యమ సమయంలో కేసీఆర్ ‘మన రాష్ట్రం’ అనే కాన్సెప్టుని తెలంగాణలోని ప్రతిఒక్కరి మనసుకు హత్తుకునేలా వివరించగలిగారు. ఇప్పుడు ‘మన పాలన’ అంటే ఎలా ఉంటుందో అందరికీ ఆమోదయోగ్యంగా కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. దీంతో ఈ సారు పార్టీ, ఈ కారు పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మరో రెండు మూడు సార్లు కూడా రూలింగ్ పార్టీగానే ఉండబోతోంది. పార్టీ పుట్టిన రోజు ఉత్సవాల సంగతేమో గానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ కొవిడ్-19 నుంచి క్షేమంగా బయటపడితే అంతే చాలు. అదే పెద్ద సంబరం.

 

Advertisement