The Legend Movie Review : ది లెజెండ్ మూవీ రివ్యూ
NQ Staff - July 28, 2022 / 02:34 PM IST

The Legend Movie Review : ఈ గురువారం విడుదలైన చిత్రాలలో ది లెజెండ్ మూవీ ఒకటి. లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా ఆయనే నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్’. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఊర్వశి రౌటేలా కథానాయిక. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
హీరో అరుళ్ శరవణన్(డాక్టర్ శరవణన్) ఈ సినిమాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త పాత్ర పోషించారు. తన పరిశోధనలతో తన ప్రజలకు, దేశానికి సేవ చేయాలని అతను కలలు గన్నాడు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి తన కలల కోసం పని చేయడం మొదలుపెడతాడు, కానీ స్థానిక రాజకీయ నాయకులు మరియు VJ అనే లోకల్ రౌడీ నుండి అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు. శరవణన్ ఈ అడ్డంకులన్నీ ఎలా ఎదుర్కొన్నాడు మరియు అతని కలను ఎలా సాకారం చేసుకున్నాడు అనేది మిగిలిన కథ.

The Legend Movie Review
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
సినిమా ప్రారంభం నుండే గతంలో వచ్చిన చాలా సినిమాలు గుర్తుచేస్తుంది మరియు సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేదు. నటుడు శరవణన్ చాలా సన్నివేశాల్లో పూర్తిగా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా ఒక బొమ్మలా కనిపిస్తాడు. గీతిక పాటల్లో అందంగా కనిపించింది కానీ సినిమాలో పెద్దగా చేసేదేమీ లేదు. ఊర్వశి రౌతేలా పరిమిత పాత్రలో ఓకే. VJ గా నటుడు సుమన్ విలన్‌గా బాగున్నా, అతని లుక్స్ చాలా కృత్రిమంగా ఉన్నాయి. వివేక్ మరియు యోగి బాబు మిమ్మల్ని కొన్ని సార్లు నవ్విస్తారు. మిగతా నటీనటులందరూ తమ వంతు పాత్రను చక్కగా చేశారు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
దర్శకులు జేడీ- జెర్రీ ఎంతో సాధారణమైన కథను అదికూడా పాత కథను కొత్తగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాతో మీకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ- ది బాస్’ సినిమాని గుర్తు చేశారు. అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా చాలా పాతది కావడంతో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహానికి గురవుతారు. నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గలేదు మరియు శరవణన్ సినిమాని అన్ని విధాలుగా గ్రాండ్‌గా చేయడానికి అవసరమైనంత ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. ఆర్.వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హారిస్ జయరాజ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

The Legend Movie Review
ప్లస్ పాయింట్స్:
సంగీతం
కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
అరుళ్ శరవణన్
పాత కథ
కథ ముందే ఊహించేలా ఉండటం
ఎమోషన్ పండక పోవడం
విశ్లేషణ:

The Legend Movie Review
2007లో విడుదలైన “శివాజీ: ది బాస్”ని మీకు ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. పాత కథతో మరియు అంతే పాత మేకింగ్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో ముఖంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కూడా లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేదు. సినిమాల గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు కూడా సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు.
రేటింగ్: 1.5/5