సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన తెలంగాణ ఫైర్ వర్క్స్ అసోసియేషన్

Admin - November 13, 2020 / 03:42 PM IST

సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన తెలంగాణ ఫైర్ వర్క్స్ అసోసియేషన్

తెలంగాణాలో బాణాసంచా ను నిషేదిస్తున్నట్లు హై కోర్ట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దీపావళి పండగకు బాణాసంచా కాలిస్తే మరిన్ని సమస్యలు ఏర్పడుతాయని తెలిపింది. అలాగే గాలిలో కాలుష్యం ఏర్పడి శ్వాస కోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకోసమే బాణాసంచా కాల్చవద్దని తెలంగాణ సర్కార్ కు సూచించింది. అలాగే ఇప్పటివరకు ఏర్పాటు చేసిన షాపులను తొలగించాలని తెలిపింది.

Politicians worrying with supreme court decisionPoliticians worrying with supreme court decision

ఇక బాణాసంచా కొన్నా, అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్ట్ సూచించింది. ఇక ఇది ఇలా ఉంటె ఒకవైపు హై కోర్ట్ నిర్ణయం పై బాణాసంచా అమ్మకదారులు గుర్రుగా ఉన్నారు. దీనితో తెలంగాణ ఫైర్ వర్క్స్ అసోసియేషన్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. బాణాసంచాను నిషేదిస్తున్నట్లు హై కోర్ట్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ను కోరింది. అయితే దీపావళి పండగకు రెండు రోజల ముందు బాణాసంచా ను నిషేధిస్తే తాము కోట్లలో నష్టపోతామని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

బాణాసంచా నిషేధాన్ని ఎత్తివేయాలని లేకపోతే బాణాసంచా వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపారు. గతంలో అనుమతి ఇచ్చి ఈ సారి ఇలా నిషేధించడం ఏంటని వాపోతున్నారు. ఇక ఇప్పటికే మొత్తం ఆరు రాష్ట్రాల్లో బాణాసంచా ను నిషేదించారు. ఇక తెలంగాణాలో కూడా నిషేదిస్తున్నట్లు నిర్ణయం తీసుకునే సరికి బాణాసంచా వ్యాపారాలు గగ్గోలు పెడుతున్నారు.

Read Today's Latest Exclusive in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us