Telangana BJP : ‘‘ఒక్కొక్కణ్నీ కాదు షేర్ ఖాన్.. వంద మందినీ ఒకే సారి రమ్మను..’’ ఈ డైలాగ్ ని ‘మగధీర’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గుక్క తిప్పుకోకుండా చెప్పి మెప్పించటం మనందరికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ టాప్ లీడర్లలో ఒకరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నిన్న ఇదే రేంజ్ లో స్పందించారు. తనపై హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మరో కేసు బుక్ చేసిన సందర్భంగా ఆయన ఇలా సీరియస్ గా రియాక్టయి వార్తల్లో నిలిచారు.
ఏమన్నారు?..
‘‘ఒక్కో కేసు నమోదు చేసే బదులు అన్ని కేసులూ ఒకేసారి బుక్ చేయొచ్చు కదా’’ అని రాజాసింగ్ సీఎం కేసీఆర్ కి, హోం మంత్రి మహమూద్ అలీకి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా ధర్మం కోసం, భారత దేశం కోసం పోరాడుతూనే ఉంటానని తెల్చిచెప్పారు. తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు.

ఇప్పటికే 60-70: Telangana BJP
‘‘మూడేళ్ల కిందట అబ్దుల్లాపూర్ మెట్ లో శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అందువల్ల మీపైన ఆ సమయంలో కేసు బుక్కైంది. కాబట్టి ఇప్పుడు నోటీసు ఇస్తున్నాం. మీరు కోర్టుకి రావాలి’’ అని చెప్పి పోలీసులు నోటీసు ఇచ్చి వెళ్లినట్లు రాజాసింగ్ వెల్లడించారు. ‘‘సీఎం, హోం మంత్రి, డీజీపీకి నేను ఒక రిక్వెస్టు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద నాపైన మీరు ఎన్ని కేసులు పెట్టాలనుకుంటున్నారో చెప్పండి. ఇప్పటికే 60-70 కేసులు పెట్టారు. ఒక కేసులో ఏడాది శిక్ష కూడా పడింది. నన్ను డిస్టర్బ్ చేయటానికి మీరెన్ని ప్లాన్లు వేసినా నేను భయపడను. జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తా. నా ప్రమేయం లేకపోయినా నాపైన కేసులు పెట్టారు. గోరక్ష గురించి మాట్లాడితే కేసు. భారత దేశం జెండా పట్టుకుంటే కేసు. ఇలా ఒకటి కాదు.. 50 కాదు.. 100 కాదు.. లక్ష కేసులు పెట్టినా నేను వెనకడుగు వేయను’’ అని రాజాసింగ్ కుండబద్ధలు కొట్టారు.
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ అధికారికి రాచకొండ కమిషనర్గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం నాపైనమరొక కేసు పెట్టడానికి.
లక్షలు కేసు పెడితే కూడా ఆగేది లేదు ధర్మం గురించి దేశం గురించి పోరాడుతూనే ఉంటా. pic.twitter.com/Kx2IYSXIOn
— Raja Singh (@TigerRajaSingh) February 23, 2021