Sonu Sood: సోనూసూద్ గొప్ప మనసు.. అంధురాలు చేతుల మీదుగా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

Sonu Sood కరోనా కాలంలో.. కష్టాలు పడుతున్న పేద వారికి సాయంచేస్తూ మాన‌వ‌త్వం చాటుకుంటూ వ‌స్తున్నాడు సోనూసూద్. క‌రోనా తొలి ద‌శ నుండి నాన్‌స్టాప్‌గా విరాళం అందిస్తున్న సోనూసూద్ ఇప్ప‌టికీ సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో దేవుడుగా మారిపోయాడు ఈ రియల్ హీరో. అభిమాన ఘణాన్ని పెంచుకుని.. అందరి వాడయ్యారు.

sonu sood

సోనూసూద్‌పై రోజురోజుకు అభిమానం పెర‌గుతూ పోతుంది. రోజుకు మిక్కిలి సంఖ్య‌లో అభిమానులు ఆయ‌న ఇంటికి వెళుతున్నారు. తనను చూసేందుకు… తాకేందుకు.. సాయమర్థించేందుకు వస్తున్న అభిమానుల అరుపులతో హొరెత్తిపోతోంది.ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు.

సోనూ చేసిన సేవలకు కొందరైతే గుడులు కట్టించి పూజలు కూడా చేస్తున్నారు. మరికొందరు వారికి పుట్టిన పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొంద‌రు షాపుల‌కి సోనూ పేరు పెడుతున్నారు. ఇక వీరాభిమానులు అయితే సోను సూద్‌ను చూడాలనే కోరికతో అనేక మార్గాల‌లో వెళుతున్నారు. రీసెంట్‌గా సైకిల్ యాత్ర చేపట్టారు. ఏకదాటిగా 1200 వందలు ప్రయాణించి చివరికి తన కోరికను నెరవేర్చుకున్నాడు.

Sonu sood
Sonu sood

మ‌రోవైపు సోనూసూద్ చేస్తున్న సాయాల‌కు ఇంప్రెస్ అవుతున్న కొంద‌రు ప్ర‌ముఖులు ఆయ‌న ఫౌండేష‌న్‌కు విరాళాలు అందిస్తున్నారు. దివ్యాంగులు సైతం సోనూసూద్ ఫౌండేష‌న్‌కు విరాళం అందిస్తూ మంచి మ‌న‌సు చాటుకుంటున్నారు. బొడ్డు నాగ‌ల‌క్ష్మీ అనే దివ్యాంగురాలు తనకు వస్తున్న పింఛను మొత్తాన్ని ఐదు నెలలుగా దాచుకుంటూ సోనూ ఫౌండేష‌న్‌కి ఇచ్చింది. ఈ విషయం తెలిసి సోనూసూద్‌ ఆమె మంచి మనసుకు చలించిపోయారు. ఆమెతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ప్రశంసించారు.

‘ఒక అంధురాలు, యూట్యూబర్‌ నాగలక్ష్మి నా ఫౌండేషన్‌కు రూ.15వేలు విరాళం ఇచ్చారు. ఇది ఆమె ఐదు నెలల పింఛను. నా దృష్టిలో దేశంలో ఆమే అత్యంత సంపన్నురాలు. ఒకరి కష్టాలు చూసేందుకు కంటిచూపు ఉండాల్సిన అవసరంలేదు’ అని గ‌తంలో కీర్తించారు.

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లికి చెందిన బొడ్డు నాగలక్ష్మి త‌న 5 నెల‌ల పెన్ష‌న్ ప‌ది హేను వేల రూపాయ‌లు ఇవ్వ‌డం విరాళంగా ఇవ్వ‌డం గ‌ర్వంగా ఉంద‌ని, జూలై 23 న ఉదయం 11:15 గంటలకు ఆంధ్రాలోని మా ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆమె చేతుల మీదుగా ప్రారంభించనున్నామ‌ని సోనూసూద్ తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నాగలక్ష్మి పుట్టుకతోనే అంధురాలు. 5వ తరగతి వరకే చదువుకున్న ఆమె ఇటీవలే ‘కవిత నాగ వ్లాగ్స్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను స్థాపించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ శరణాలయాలు, వృద్ధులు, పేదలకు అందిస్తోంది. ఆమె యూట్యూబ్‌ చానల్‌కు లక్ష మందికిపైగా సబ్‌స్రైబర్లు ఉన్నార‌నే విష‌యం తెలిసిందే