Somu Veerraju: సోము వీర్రాజు ఏమైపోయాడు?.. కొంపదీసి మార్చేశారా?

Somu Veerraju: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమైపోయాడు?. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం వెలువడ్డ తెల్లారి నుంచి మీడియాలో పెద్దగా కనిపించట్లేదు. ఆయనకి బదులు విశాఖ నార్త్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిత్యం ఏపీ సర్కార్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతను ఇవాళ ఆదివారం మరీ విచిత్రమైన కామెంట్లు చేశాడు. సీఎం వైఎస్ జగన్ చేతగానితనం వల్లే ప్రజలు ప్రాణవాయువు దొరక్క చనిపోతున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి పదవిని ఆయన సతీమణి భారతికి ఇవ్వాలని, అప్పుడైనా రాష్ట్రంలో మార్పు వస్తుందేమోనని విష్ణుకుమార్ రాజు వెటకారంగా అన్నాడు. దీంతో.. ఇదిగో ఇలాంటి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయబట్టే సోము వీర్రాజు పొలిటికల్ గా పత్తా లేకుండా పోయాడని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. సోము వీర్రాజంటే గుర్తొచ్చింది. కొంపదీసి బీజేపీ ఏపీ చీఫ్ పోస్టు నుంచి అతణ్ని మార్చేశారా ఏంటి అని జనం అడుగుతున్నారు.

Somu Veerraju

ఎందుకంటే..

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా ఈ విష్ణుకుమార్ రాజే స్పందిస్తున్నాడు. బహుశా మేమూ మేమూ ఒకటే ‘రాజు’లం అని చెప్పుకోవటానికి తెర మీదికి వస్తున్నాడేమో అని పబ్లిక్ అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశాడు కదా అనంటే న్యాయ వ్యవస్థను అస్థిరపర్చటానికి వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో జడ్జిలను ముక్కులు ముక్కలుగా నరికేయాలని చెప్పినప్పుడు అది అస్థిరపర్చటం కాదా అంటూ విష్ణుకుమార్ రాజు భలే షార్ప్ గా బదులిచ్చాడు. మరి, వాళ్లపై సీబీఐ కేసులు పెట్టారు కదా అనే సంగతిని మాత్రం ఆయన మర్చిపోయారు.

Somu Veerraju

‘బండి’కెందుకు?..

బీజేపీ ఏపీ శాఖ సరిగా పనిచేయట్లేదని తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి కూడా అనిపించిందేమో. రఘురామకృష్ణరాజు అరెస్టుపై వెంటనే స్పందించాడు. ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించాడు. అఫ్ కోర్స్ బండి సంజయ్ ఏపీ, తెలంగాణ విషయాలపైనే కాదు. పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ పైనా రియాక్ట్ కాగలడు. అతనికి ఆ సత్తా ఉంది. తనను తాను నేషనల్ లీడర్ లా భావిస్తాడు. అది వేరే విషయం. ఇంతకీ సోము వీర్రాజు ఎందుకు యాక్టివ్ గా ఉండట్లేదు. తిరుపతి దెబ్బతో దిమ్మతిరిగి జగన్ బొమ్మ కనపడిందా?. పవన్ కళ్యాణ్ ని సీఎంగా ప్రకటించినా వర్కౌట్ కాలేదని వర్రీ అవుతున్నాడా?. కమల నాథులు కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Somu Veerraju