Sita Ramam Review : సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం సీతారామం. ఈ సినిమాకు పాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నాయి. చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు మూవీపై ఆసక్తిని కలిగించాయి. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ:
సీతారామం సినిమా ఒక మంచి పిరియాడిక్ సినిమా. సినిమా 1985 ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ తన మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఓ బాధ్యత అప్పజెబుతాడు. ఇండియాకు చెందిన మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్) ఎక్కడుందో కనుక్కొని ఆమెకు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఇళ్ళ క్రితం రాసిన లెటర్ అందజేయాలని చెబుతాడు. మహాలక్ష్మీ కోసం అఫ్రీన్ అనేక పాట్లు పడుతుంది. అయితే లెఫ్టినెంట్ రామ్, మహాలక్ష్మీకి పరిచయమే లేకపోగా, ఇద్దరి మధ్య ప్రేమ ఎఆ పుట్టింది, రామ్ తన లేఖలో ఏమి రాశాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాగూర్, రష్మిక మందాన తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. హను రాఘవపూడి క్యాస్టింగ్ కూడా సినిమాకు కలిసొచ్చింది. సినిమా ఎక్కువ భాగం లీడ్ పెయిర్‌పైనే నడుస్తుంది. దుల్కర్, మృణాల్ సినిమా మొత్తాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. తరుణ్ భాస్కర్, సుమంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సునీల్ మరియు వెన్నెల కిషోర్ కామెడీ పాత్రల్లో చక్కటి నవ్వులు పూయించారు. సపోర్టింగ్ క్యారెక్టర్లు వారి వారి పాత్రల్లో మెప్పించాయి. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖ నటీనటులు స్క్రీన్ టైమ్ కొన్ని సన్నివేశాలకే పరిమితం కావడంతో సరిగా వినియోగించుకోలేకపోయారు.

టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్, సస్పెన్సు, హ్యూమర్ తో నడిపించాడు హను రాఘవపూడి. విజువల్స్ గురించి కూడా ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సస్పెన్సు ప్రేక్షకుల మదిలో క్యారీ అయ్యేలా దర్శకుడు చేయగలిగాడు. మెల్లగా సాగే కథనం ఒకింత నిరాశపరిచే అంశం. ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పే క్రమంలో హను అక్కడక్కడా నిరాశకు గురి చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలైనా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా విశాల్ న్యాయం చేశాడు. పిఎస్ వినోద్ మరియు శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ వర్క్ అత్యద్భుతంగా ఉంది, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కాశ్మీర్ లోయను అందంగా ప్రదర్శించారు. కోటగిరి వెంకటేశ్వర్లు ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:
లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ
విజువల్స్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో ల్యాగ్ సన్నివేశాలు
ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు
విశ్లేషణ:
పీరియాడికల్ డ్రామాగా సీతారామం చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సస్పెన్స్ చివరి వరకు క్యారీ చేయగలిగిన కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు ప్రేక్షకులకి వినోదాన్ని పంచలేకపోయాయి. రన్‌టైమ్ ఓ పదిహేను నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంగేజ్ చేయగలుగుతుంది కాని అంతగా ఆకట్టుకోదు అని మాత్రం చెప్పొచ్చు .