Samantha: మా అమ్మ‌ ఎప్పుడు నాతో చెప్పేది.. నేను ఏనాడు న‌మ్మ‌లేద‌న్న‌ స‌మంత‌

Samantha: అక్కినేని నాగ చైతన్య‌ను వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత అక్టోబ‌ర్ 2న నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం తాను గ‌తాన్ని మ‌ర‌చి ఫుల్‌గా చిల్ అవుతుంది. అయితే స‌మంత రీసెంట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు హాట్ సీట్‌పై సమంత కూర్చొని ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

TheNewsQube-

Samantha

ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దసరా సందర్భంగా సమంతకు సంబంధించిన ఎపిసోడ్ ప్ర‌సార‌మైంది. చైతూతో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా బయటకు రాలేదు. దీంతో సహజంగానే అందరికీ ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్‌తో కలిసి షోలో ఎంతో సందడి చేసింది సామ్‌.

క్విజ్‌లో భాగంగా ‘ఛాంప్స్‌ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ని చూడవచ్చు’ అన్న ప్రశ్నను సంధించారు ఎన్టీఆర్‌. అయితే దీనికి సరైన సమాధానం గుర్తించలేకపోయిన సమంత 50:50 ఆప్షన్స్‌కు వెళ్లింది. అందులో ‘ప్యారిస్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకోగా ఎన్టీఆర్‌, ప్రేక్షకులు మొత్తం సైలెంట్‌ అయ్యారు.

దీంతో మరింత టెన్షన్‌ పడిపోయిన సామ్‌ను సరదాగా ఆటపట్టించారు ఎన్టీఆర్‌. ‘ప్యారిస్‌ వెళ్తే ఎంతసేపూ షాపింగ్‌ చేయడం, ఐఫిల్‌ టవర్‌ చూసేసి, బాగా బ్యాగులు కొని తెచ్చుకోవడమేనా?’ అని అనడంతో సమంత ముఖంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఆ వెంటనే ‘ప్యారిస్‌’ కరెక్ట్‌ ఆన్సర్‌ అని చెప్పడంతో మరింత సంబరపడిపోయింది. ఈ ప్రశ్నతో రూ.1.60లక్షలు గెలుచుకుంది.

ఇక రూ.25లక్షల ప్రశ్నగా ‘సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశిథరూర్‌ ‘యాస్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకం దేని గురించి రాయబడింది’ అన్న దానికి ‘బ్రిటిష్‌ పరిపాలన’ అని సరైన సమాధానం ఎంచుకుని తెగ ఆనందపడిపోయింది సామ్‌. ఆ వెంటనే ”మా అమ్మ ఎప్పుడూ నాతో చెప్పేది నువ్ జీనియస్ అని.. నేను ఎప్పుడూ నమ్మలేదు కానీ ఈ రోజు నమ్ముతున్నా” అనేసింది సమంత.

అయితే అది నేను నిరూపించాను అని ఎన్టీఆర్ అన్నారు. నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా నా కాళ్లకు నమస్కారం పెట్టడం, నా ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం లాంటివి మాత్రం వద్దు. అవన్నీ నీకు నచ్చవని నాకు తెలుసు అంటూ సమంతపై స్వీట్ పంచ్ వేశారు ఎన్టీఆర్. దీంతో సమంత తెగ నవ్వేసింది. ఎన్టీఆర్ మాటల‌కు న‌వ్వులు పూశాయి.