Samantha : ‘ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు. నువ్ కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు’ చైతూ, సామ్ జంటగా నటించిన మజిలీ మూవీలో ఓ పాటిది. ఆ లైన్స్ కు తగ్గట్టుగానే వాళ్ల ప్రేమకథ, పెళ్లికథ కూడా అందరూ అనుకున్న విధంగా కోరుకున్న మజిలీ చేరలేదు.
రిలేషన్లో సంవత్సరాలు కలిసున్నా, పెళ్లయ్యాక మాత్రం ఎక్కువకాలం జంటగా కలిసుండలేకపోయారు. సిల్వర్ స్క్రీన్ పై ‘మాయ’ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం వాళ్ల మధ్య మ్యాజిక్ ని మాయం చేసుకున్నారు.
సమంతకి అక్కినేని ఫ్యామిలీకి పడట్లేదనీ, డిస్టర్బెన్స్ వస్తున్నాయనీ, కెరీర్ విషయంలోనూ ఇద్దరికీ పొసగట్లేదనీ, సామ్ ఇంకెవరితోనో క్లోజ్ గా ఉంటుందనీ, చైతూ వారించినా లాభం లేకుండా పోయిందనీ.. ఇలా ఎన్నో స్పెక్యులేషన్స్, మరెన్నో గాసిప్స్.. ఫైనల్ గా అఫీషియల్ డివోర్స్.
మీ వర్క్ పైనా మీ ఫ్యామిలీ పైనా కాంసంట్రేట్ చేయండి’ …
అయితే మోస్ట్ అడోరబుల్ అండ్ క్యూట్ కపుల్ గా సౌత్ మొత్తంలోనూ పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లికి ముందు, పెళ్లి తర్వాతే కాదు.. విడాకుల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు. వాళ్ల వాళ్ల కామెంట్స్ తో, సోషల్ మీడియా అప్ డేట్స్ తో హెడ్ లైన్స్ లో ఉంటున్నారు.
- Advertisement -
సమంత విడాకులై ఇన్నినెల్లవుతున్నా ఇంకా టీజింగ్ ట్వీట్స్ అండ్ రిప్లైస్ ఇవ్వడం మానలేదు. ఇప్పుడిక ఎందుకులే అని ఏమాత్రం అనుకోకుండా తనకు నచ్చినట్టుగా ఇచ్చిపడేస్తోంది.ఇది చాలదన్నట్టు మరోవైపు హాట్ ఫోటోషూట్స్ తో హీట్ పెంచుతుంది. విడాకులయ్యి అవడంతోనే పుష్ప లో ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ చేసి అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయినా నో కేర్ అనుకుంది. ఎందరు గుస్సా అయినా జెస్సీ మాత్రం తగ్గేదేలే అంటూ తనకు నచ్చిన ప్రాజెక్ట్స్ తాను చేసుకుంటూ పోతోంది.

మరి నిజంగానే క్యారెక్టర్స్ పరంగా ఎక్స్ పెరిమెంట్స్ చేయాలనా? లేక కేవలం ఇది నా లైఫ్ నా ఇష్టం అని స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేయాలనా? సమంత ఇవన్నీ ఎందుకు చేస్తోందనేది కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా నడుస్తోన్న చర్చ.
ఇక మరోవైపు డివోర్స్ తర్వాత చైతూ శోభిత ధూళిపాలతో రిలేషన్ లో ఉన్నాడనేది సోషల్ మీడియా టాక్. వాళ్ల ఫోటోస్ ని అప్ లోడ్ చేస్తూ చాలా సైట్స్ ఇప్పటికే హాట్ హాట్ గాసిప్స్ ని వండి వడ్డించేస్తున్నాయి. ఇందులో నిజమెంత? అబద్దమెంత అన్న విషయం పక్కనపెడితే..
ఈ రూమర్ల వెనక సమంత హస్తం ఉందంటూ వచ్చిన టాక్ పైనా సమంత డైరెక్ట్ గానే స్పందించింది.
‘అమ్మాయిల మీద రూమర్స్ వస్తే కచ్చితంగా నిజం. అదే అబ్బాయిల మీద వస్తే మాత్రం అమ్మాయి ప్లాన్ చేసినట్టు. గ్రో అప్ బాయ్స్. మూవ్ ఆన్ అవ్వండి. మీ వర్క్ పైనా మీ ఫ్యామిలీ పైనా కాంసంట్రేట్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా రీసెంట్ గా రానా చేసిన ట్వీట్ కూడా డిస్కషన్స్ కి దారితీసింది. తన లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ టీజర్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘నన్ను నేను సరిచేసుకోడానికి చేస్తున్న ప్రయాణమే థ్యాంక్యూ’ అని క్యాప్షన్ ఇచ్చాడు చైతూ. చై ట్వీట్ పై రానా ఆసక్తిగా స్పందించాడు. ‘నువ్ ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో చైతన్య డైవర్స్ గురించే రానా ఇలా కామెంట్ చేశాడా అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
అంటే వీళ్లిద్దరి విడాకుల విషయంలో ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉందా? నువ్ చేసింది కరెక్టే అని బాహాటంగానే పోట్రెయిట్ చేస్తున్నారా అంటూ డౌట్స్ రైజయ్యాయి. సామ్ వీటిని కూడా ఇంకాస్త సీరియస్ గా తీసుకుందేమో మీరు ఒకటంటే నేను రెండంటా అనే టైప్ లో రియాక్టవుతోంది.
ఇక అప్పట్లో అఫీషియల్ గా డివోర్స్ అనౌన్స్ చేశాక తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వాళ్లు జంటగా కలిసున్న ఫోటోలను డిలీట్ చేసింది సామ్. కానీ తనని పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్ చేస్తే మాత్రం వచ్చే ఎమోషన్ ని డిలీట్ చేయలేకపోతుంది.

అంతేకాదు.. చాలా ఇంటర్ వ్యూల్లోనూ డివోర్స్ తర్వాతి హార్డ్ డేస్ ను తను ఎలా హ్యాండిల్ చేసిందో చెప్పుకొచ్చింది. మరోవైపు కెరీర్ లోనూ చైతూని డామినేట్ చేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ టూతో సమంత బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటే, ఆతర్వాత చైతన్య అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చడ్డాలో నటించి బీటౌన్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
దీంతో వెండితెర శకుంతల మరో అడుగు ముందుకేసి ఏకంగా హాలీవుడ్ తెరంగేట్రానికే ప్లాన్ చేసింది. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా దూకుడు చూయిస్తున్న సమంత సోషల్ మీడియాలోనూ ఎంతకాలం ఇలా ముక్కుసూటిగా రియాక్టవుతుందో, స్ట్రాంగ్ రిప్లైస్ తో మరెన్ని రోజులు వార్తల్లో నిలుస్తుందో చూడాలి.