Samantha: సమంత త‌ల్లి కాబోతుందా.. ఫొటో చూస్తే అదే అనుమానం క‌లుగుతుంది!

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత తొలిసారి నాగ చైత‌న్య‌తో క‌లిసి ఏ మాయ చేశావే అనే చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా స‌మ‌యంలో చైతూ, సామ్‌ల మ‌ధ్య స్నేహం ఏర్ప‌డ‌గా, అది రాను రాను ప్రేమ‌గా మారింది. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి ఇద్దరు డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకున్నారు. పెళ్లి ద‌గ్గ‌ర నుండి ఇద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్నారు.

Samantha Latest Pic Raise Doubts
Samantha Latest Pic Raise Doubts

అయితే ఇటీవ‌ల త‌మ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు కూడా వ‌స్తుంటాయ‌ని, ఆ స‌మ‌యంలో చైతూనే ముందు కాంప్ర‌మైజ్ అవుతాడ‌ని పేర్కొంది.ఎందుకంటే తనకు సిగ్గు లేదంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్న స‌మంత రీసెంట్‌గా మనోజ్ బాజ్‌పెయీ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

స‌మంత‌- నాగ చైత‌న్య వివాహం జరిగి ఐదేళ్లు కావొస్తున్న‌ప్ప‌టికీ ఈ జంట ఇంకా గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో సమంత తల్లి కాబోతోందంటూ కొన్ని వేలసార్లు ప్రచారం జరిగింది.దీనిపై స‌మంత కొన్ని సార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది మా వ్య‌క్తిగ‌త విష‌యం. అంద‌రికి దీనిపై ఎందుకు అంత శ్ర‌ద్ధ అని చిర్రుబుర్రులాడింది.

Samantha Latest Pic Raise Doubts
Samantha Latest Pic Raise Doubts

కాని అభిమానులు, నెటిజ‌న్స్ మాత్రం కొంత అనుమానం వ‌చ్చిన సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోని చూసి స‌మంత త‌ల్లి కాబోతుంద‌నే అనుమానం వ్య‌క్తం చేశారు ఫ్యాన్స్.

తాజాగా స‌మంత షేర్ చేసిన ఫొటోలో ఆమె చ‌బ్చీగా క‌నిపించ‌డంతో పాటు తన తోటలోని మామిడి కాయను చూస్తున్నట్టుగా ఉంది. అంతేకాదు ఆ ఫోటోలో మామిడికాయ‌నే హైలైట్ అయింది. ఇవ‌న్నీ చూస్తుంటే స‌మంత త్వ‌ర‌లో శుభ‌వార్త చెప్ప‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొంద‌రు మాత్రం స‌మంత త‌న సాకీ డిజైన్ దుస్తుల‌ను ప్ర‌మోట్ చేసుకునేందుకు ఇలా స్టిల్ ఇచ్చింద‌ని చెబుతున్నారు.

కాగా, స‌మంత పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఫ్యామిలీ మెన్ సీజ‌న్ 2లో రాజీ అనే పాత్ర‌లో క‌నిపించి అంద‌రి మ‌తులు పోగొట్టింది. బోల్డ్, యాక్షన్ ఇలా ఎటువంటి సన్నివేశాల్లోనైనా తాను నటించగలనని స‌మంత నిరూపించింది. ది డేరింగ్ లేడీ ఆఫ్ సౌత్ సినిమా అంటూ స‌మంత‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.