S.Vani Devi : వాణీదేవి విజయానికి.. పెట్టని కోటలెన్నో..
Kondala Rao - March 10, 2021 / 02:14 PM IST

S.Vani Devi : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయానికి పెట్టని కోటలెన్నో కనిపిస్తున్నాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 5 లక్షల 17 వేల పైచిలుకు కాగా అందులో మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా లక్షా 90 వేలు దాటింది. ఈ స్థానం నుంచి శాసన మండలి బరిలో నిలిచిన ఏకైక మహిళ ఎస్.వాణీదేవే కావటంతో స్త్రీలందరూ ఆమెకు ఓటేసినా ఈజీగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. మహిళా ఓటర్లకు తోడు ఇప్పటికే చాలా ఉద్యోగ, సామాజిక, మహిళా సంఘాలు ఎస్.వాణీదేవికి మద్దతు తెలిపాయి. టీఆరెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వాళ్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఇలా అన్ని వర్గాల వాళ్లూ ఎస్.వాణీదేవికే ఓటేస్తారని ఆశిస్తున్నారు.
బోలెడు పథకాలు..
ఎస్.వాణీదేవి అధికార పార్టీ క్యాండిడేట్ కావటం అతి పెద్ద కలిసొచ్చే అంశం. ఎందుకంటే టీఆరెస్ పార్టీ ప్రభుత్వం గడచిన ఏడేళ్లుగా రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఈ స్కీముల ద్వారా లబ్ధి పొందనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, జనరల్ డిగ్రీలు చదివిన వేలాది మంది విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే వాళ్లకు కేసీఆర్ సర్కార్ ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుచేస్తోంది. దీనికితోడు స్కాలర్ షిప్పులు ఇస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే పేద విద్యార్థులకు లక్షల్లో ఆర్థిక సాయం చేస్తోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో కట్న కానుకలు అందిస్తోంది. తద్వారా ఆయా కుటుంబాలు అప్పుల పాలు కాకుండా అండగా నిలుస్తోంది.
ఒకటేమిటి?: S.Vani Devi
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో పథకాలను ప్రవేశపెడుతూ అందర్నీ ఆర్థికంగా ఆదుకుంటోంది. గర్భిణులకు అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందిస్తోంది. వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు వేయించుకున్నా, డెలివరీ చేయించుకున్నా డబ్బులతోపాటు కేసీఆర్ కిట్ అందజేస్తోంది. డెలివరీ అయ్యాక కూడా ఆరు నెలల పాటు అంగన్ వాడీల ద్వారా తల్లీబిడ్డకు బలవర్ధక ఆహారం సమకూరుస్తోంది. ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇస్తోంది. గ్రాడ్యుయేషన్ చదువుకున్నవాళ్లు చాలా మంది వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్లకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను రూపొందించింది. బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పిస్తోంది. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తోంది.

S.Vani Devi : number of factors leading to s.vani devi victory
నిరుద్యోగ భృతి
టీఆరెస్ సర్కారు త్వరలో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు నెల నెలా భృతి చెల్లించనుంది. ఈ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు జరపనుంది. ఇవి కాక వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి రుణాలు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలిస్తోంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, రెసిడెన్షియల్ టీచర్లు, పోలీసులు, నర్సులు, అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు, సాగునీటి శాఖలో సివిల్ ఇంజనీర్లు తదితర ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా చెప్పుకుంటూపోతే గ్రాడ్యుయేట్లకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుచేస్తోంది. వాళ్లంతా తమ అభ్యర్థి ఎస్.వాణీదేవికి ఓటేసి ఘనంగా గెలుపొందిస్తారని భావిస్తోంది.