#RRR : తెలంగాణ రాష్ట్రానికి మరో అపురూపమైన ప్రాజెక్టు.. కేంద్రం ప్రకటన..

#RRR : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి మరో అపురూపమైన ప్రాజెక్టును మంజూరు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కి మోడీ సర్కారు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ లీడర్లు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ తదితరులు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిన్న సోమవారం ఢిల్లీ కలిశారు. ఈ సమావేశంలో ఆర్ఆర్ఆర్ కి కావాల్సిన అన్ని పర్మిషన్లు ఇవ్వాలని వాళ్లు రిక్వెస్ట్ చేయగా ఆయన ఓకే అన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు డిటెయిల్స్ ని వివరించారు.

గేమ్ ఛేంజర్..

తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ లో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ ఛేంజర్ లాంటిదని కిషన్ రెడ్డి అభివర్ణించారు. దీనికి అవసరమైన భూమిని స్టేట్ గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా సేకరించి ఇవ్వాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్టును కేంద్రం రెండు భాగాలుగా పూర్తిచేయనుందని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ని మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి గడ్కరీకి ఆయన రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. భాగ్య నగరానికి వచ్చే అన్ని హైవేల్నీ కలుపుతూ ఈ రోడ్డుని నిర్మిస్తామన్నారు. దీంతో లాజిస్టిక్ పార్కుల డెవల్మెంట్ తోపాటు ఇన్వెస్టిమెంట్లు కూడా వస్తాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

#RRR : another prestigious project to telangana
#RRR : another prestigious project to telangana

రూ.17 వేల కోట్లు: #RRR

ఈ రీజనల్ రింగ్ రోడ్డుని హైదరాబాద్ సిటీకి 50 నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కి 30 కిలో మీటర్ల దూరంలో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా నిర్ణయించారు. ఫస్ట్ ఫేజ్ లో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు (158 కిలో మీటర్లు), సెకండ్ ఫేజ్ లో చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు (182 కిలో మీటర్లు) పూర్తి చేస్తారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ఆర్ఆర్ఆర్ తో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరుచేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

Advertisement