సోనియా మొహం మీదే మొహమాటం లేకుండా ఆ విషయం చెప్పేసిన రేవంత్ రెడ్డి ?

Tech Desk-2 - January 4, 2021 / 04:02 PM IST

సోనియా మొహం మీదే మొహమాటం లేకుండా ఆ విషయం చెప్పేసిన రేవంత్ రెడ్డి ?
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలనే విషయమై అధినేత సోనియా గాంధీ ఇంకా రాహుల్‌ గాంధీలు ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు. పార్టీ రెండు దఫాలుగా అధికారంకు దూరంగా ఉంది. మరో సారి కూడా అధికారంకు దూరం అయితే ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఇప్పటికే బాగా చతికిల్ల పడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డి ఒకానొక సమయంలో అధినేత సోనియా గాంధీ వద్ద కీలక విషయాన్ని ప్రస్థావించాడట.
revanth reddy comments in front of sonia gandhi about congress party 

revanth reddy comments in front of sonia gandhi about congress party

దేశంలో పార్టీ అభివృద్దికి మంచి నాయకులను ఎంపిక చేయడం కాదని కార్యకర్తలను పట్టించుకుని వారి కోసం పని చేయాలని వారికి మద్దతుగా ఉండాలని సూచించాడట. ఇంత కాలం పార్టీ కోసం పని చేస్తున్న వారిని కొందరు నాయకులు పట్టించుకోలేదు. అందుకే కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. పార్టీ నాయకులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడగలరు. కాని కార్యకర్తలు మాత్రమే ప్రజల్లోకి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తీసుకు వెళ్లగలరు. అందుకే మనం కార్యకర్తలను పట్టించుకోవాలంటూ సలహా ఇచ్చాడట.
రేవంత్‌ రెడ్డి కి పీసీసీ పదవి దక్కితే పార్టీని కింది స్థాయి నుండి మార్చుకుంటూ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా నియోజక వర్గ స్థాయిలోని కార్యకర్తలతో భేటీ అయ్యి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ఆయన ట్రైనింగ్ ఇప్పిస్తాడట. ఇవన్నీ చేసేందుకు తనను పీసీసీ చీప్‌ గా ఎంపిక చేయాలంటూ అధినాయకత్వం వద్ద రేవంత్‌ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడట. ఇప్పటికిప్పుడు రేవంత్‌ కు ఆ పదవి ఇస్తే సీనియర్‌ లు రెచ్చి పోయే అవకాశం ఉంది. అందుకే కాస్త ఆలస్యం చేసి ఆ తర్వాత రేవంత్ కు ఆ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us