గంటా శ్రీనివాస రావుకి వైసీపీ దెబ్బ.. నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉండి పోయారా

విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రులకు సమానంగా విశాఖపట్నం రాజకీయాలను శాసించిన ఏకైక నాయకుడు గంటా శ్రీనివాసరావు. బలమైన సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాత కలిగి ఉన్నారు. అందుకే ఆయన్ని ఏ పార్టీ అయినా, సరే.. చేర్చుకోవడానికి అభ్యంతరం తెలపదు.

గంటా శ్రీనివాసరావు ఎటువంటి పరిస్థితులలోనైనా తొణకరు, బెణకరు. స్థిరమైన మనస్తత్వం కలిగిన గంటా ఏదో ఒక సందర్భంలో బరస్ట్ అవుతుంటారు. కొద్ది నెలల క్రితం అతని అనుచరుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు తన శాంతాన్ని వీడి వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అప్పట్లో గంటా కి టీడీపీ పెద్దలు కూడా సపోర్ట్ గా నిలిచారు. కేవలం తన అనుచరుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినందుకే గంటా నానా రచ్చ సృష్టించారు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏకంగా ఆయన భూములనే టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమకట్టడాల అంటూ గంటా శ్రీనివాసరావు భవనాలను జగన్ సర్కార్ కూల్చి వేయించింది. దీనితో గంటా శ్రీనివాస్ రావు న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా సైలెంట్ అయిపోయారు. ఐతే జగన్ గంటా శ్రీనివాస్ రావు ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇందుకు కారణాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

reasons behind ganta srinivas rao silent
reasons behind ganta srinivas rao silent

వాస్తవానికి అధికారంలో ఉన్నంత కాలం గంటా శ్రీనివాస రావు కి మంచి పదవులు ఇవ్వడానికి టీడీపీ పార్టీ ఆసక్తి కనబరచింది. ఇప్పుడు కూడా ఉత్తర నియోజకవర్గం పార్టీ ఇన్చార్జిగా నియమించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం గంటా శ్రీనివాస రావు ని టీడీపీ పార్టీ నుంచి వైదొలగేలా చేస్తున్నారు. ఐతే గంటా ని జగన్ తన పార్టీలో చేర్చుకుంటారా అంటే.. సమాధానాలు నెగిటివ్ గానే వినిపిస్తున్నాయి. గంటాని ఎటూ కాకుండా.. రాజకీయాలకి శాశ్వతంగా దూరం చేయాలనేది జగన్ యొక్క లక్ష్యం అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే గంటా శిబిరాన్ని నేరుగానే జగన్ సర్కార్ టార్గెట్ చేయాల్సి ఉంటుంది.

టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దొరికినంత దోచుకున్నారనేది వైసీపీ పార్టీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. జగన్ కూడా టీడీపీ నేతలందరూ కూడా అవినీతిపరులైనని బలంగా నమ్ముతున్నారు. ప్రజలకు కూడా టీడీపీ నేతలు ఎంత అవినీతిపరులు చెప్పాలని ఉవ్విళూరుతున్నారు. టీడీపీ అవినీతిపరులను అందరినీ ప్రక్షాళన చేసి తన రాజ్యాన్ని బలపరచుకోవాలని జగన్ ఉబలాటపడుతున్నారు. ఇందులోని భాగంగానే గంటాకు అత్యంత సన్నిహిత అనుచరుడైన రియల్టర్, టీడీపీ నేత కాశీ విశ్వనాథం భూ కబ్జాను కూడా తెరమీదికి తెస్తున్నారు. ఇప్పటికే కాశీ విశ్వనాథం అక్రమంగా కబ్జా చేసిన భూములను అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే తన భూములను స్వాధీనపరుచుకున్నందుకుగాను కాశీవిశ్వనాథం పెద్ద దుమారమే సృష్టిస్తున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములన్ని కూడా ప్రైవేట్ భూములేనని.. తనకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే తన భూములను స్వాధీనపరుచుకోవడం అన్యాయమని ఆయన గళం ఎత్తుతున్నారు కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం మన్ను తిన్న పాములా సైలెంట్ గా ఉన్నారు.

అయితే ఒకవేళ గంటా శ్రీనివాసరావు తన అనుచరులను టార్గెట్ చేస్తున్న వైసీపీ సర్కారుపై బాహాటంగానే విరుచుకుపడినట్లయితే టీడీపీ కే లాభం చేకూరుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. చాలా సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ని తట్టి లేపితే అతను బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగి విశాఖ రాజకీయాల్లో మరింత ప్రభావం చూపుతారని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ని టార్గెట్ చేసి అతన్ని బలమైన నేతగా వైసీపీ తీర్చిదిద్దితే టీడీపీ పార్టీకే చాలా లాభం చేకూరుతుంది. కానీ వైసీపీ అమలుపరుస్తున్న వ్యూహంలో గంటా శ్రీనివాసరావు తన స్థిమితం కోల్పోయి ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఇరకాటంలో పడినట్లే అవుతుంది. ఆ ఛాన్స్ కోసమే జగన్ సర్కార్ గంటా శ్రీనివాసరావు ని కావాలని ఇరిటేట్ చేస్తోంది. మరి ఈ రాజకీయ పరిణామాల్లో ఎవరు నష్టపోతారో ఎవరు లాభపడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement