Dhamaka Movie : మాస్ మహారాజ పరువు నిలబెట్టిన ధమాకా. డివైడెడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల ధమాకే.
NQ Staff - January 3, 2023 / 08:48 PM IST

Dhamaka Movie : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచి రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న రవితేజకి కొన్నాళ్లుగా మాత్రం బ్యాడ్ టైమ్ నడుస్తూ వచ్చింది. క్రాక్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో మాస్ మహారాజ ఫ్యాన్సు కూడా నారాజయ్యారు. రామారావ్ ఆన్ డ్యూటీ ప్రేక్షకులకి థియేటర్లో నిద్రపోయే డ్యూటీ వేయించింది. ఖిలాడీ మూవీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేతే భారీ రాడ్ అనిపించుకుంది. కానీ లక్ కలిసొచ్చి ధమాకా మాత్రం బాక్సాఫీస్ దగ్గర టైటిల్ కి జస్టిఫై చేసింది. నిజంగానే ఫ్యాన్స్ కి ధమాకా సెలబ్రేషన్సునిచ్చింది.
నిజానికి సినిమా రిలీజయ్యాక ఫస్ట్ షో నుంచి డివైడెడ్ టాకే వచ్చింది. కమర్షియల్ సీన్లన్ని కలిపి ఓ మూవీ తీశారంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. కట్ చేస్తే కలెక్షన్లు మాత్రం బాగా దక్కించుకుందీ మూవీ. ఇంద్ర మూవీ స్పూఫ్ సీన్, పల్సర్ బైక్ సాంగ్, శ్రీలీల గ్లామర్, రవితేజ, రావు రమేష్ మధ్య వచ్చే పేరడీ సాంగ్స్.. ఇలా ఆడియెన్స్ ఎంటర్టెయినయ్యే ఎలిమెంట్స్ బాగా వర్కవుటయ్యాయి. దాంతో వసూళ్లపరంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, థియేటర్ ఓనర్లతో పాటు అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ.
ఇప్పటివరకూ అనౌన్సయిన క్యాలుకులేషన్స్ ప్రకారం చూసుకుంటే థియేట్రికల్ రైట్స్ కింద రూ. 18 కోట్లు, ఓవరాల్ కలెక్షన్స్ రూ. 30 కోట్లు.. ఇలా లాభాలవైపు దూసుకెళ్తుంది ధమాకా. పైగా గత శుక్రవారం, ఈ శుక్రవారం కూడా ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసేంత మంచి సినిమాలేవీ రాలేవు. డిసెంబర్ 31న రీ రిలీజైన ఖుషీ మాత్రమే ప్రజెంట్ హౌజ్ ఫుల్ కలెక్షన్లో రన్ అవుతుంది.

Ravi Teja Fans Are Celebrating Dhamaka Movie
మరోవైపు సంక్రాంతి వరకూ స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడం కూడా మాస్ మహారాజకి బాగా కలిసొచ్చింది. మరోవైపు ఈ మూవీ రవితేజకి బంపర్ హిట్ ఇవ్వడంతో పాటు హీరోయిన్ శ్రీలీలకి కూడా కెరీర్ పరంగా మంచి బూస్టప్ నిచ్చింది.
మొత్తానికి రవితేజ కొన్నాళ్లుగా ఉన్న నెగిటివ్ ఫేజ్ నుంచి బయటపడడంతో పాటు, తన అప్ కమింగ్ సినిమాలైన టైగర్ నాగేశ్వరరావు, రావణాసురలకు కూడా పాజిటివ్ హైప్ తెచ్చిపెట్టేలా హెల్ప్ చేసింది ధమాకా. ఈ లెక్కన ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చుంటే ధమాకా వసూళ్లు కూడా మరో రేంజులో ఉండేవేమో అన్నది బాక్సాఫీస్ అనలిస్టుల అంచనా.
ఏదైతేనేం, ఇటు రవితేజకి, ఫ్యాన్సుకి, అటు ఆయనతో కొలాబరేట్ అయిన మేకర్సుకి కూడా హోప్స్ నిచ్చిన ధమాకా సంక్రాంతి లోపు ఇంకా ఏ రేంజ్ వసూళ్లతో దూసుకుపోనుందో చూడాలి.