Prabhas : సలార్ షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆదిపురుష్ షూటింగ్ కూడా చేస్తోన్న ప్రభాస్.. దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్ !

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యమ స్పీడు మీదున్నాడు. మొన్నే ‘రాధేశ్యామ్’ మూవీ షూటింగ్ పూర్తిచేసిన అతను వెంటనే నిన్న ‘సలార్’ సినిమాని అఫిషియల్ గా లాంఛ్ చేశాడు. ఫ్యాన్స్ ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ఈ హీరోగారు ఈరోజు ‘ఆదిపురుష్’ చిత్రాన్నీ పట్టాలెక్కించేశాడు. బాహుబలి అనంతరం బాగా గ్యాప్ తీసుకొని ‘సాహో’ ఫిల్మ్ ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తే అది కాస్తా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఇకపై సినిమాకీ సినిమాకీ మధ్య మరింత ఆలస్యం చేయొద్దని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే వెంటవెంటనే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతున్నాడని భావిస్తున్నారు.

మరీ ఇంతా?..

మూవీకీ మూవీకీ మధ్య మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వొద్దనేదే ఈ డార్లింగ్ లక్ష్యమైతే కావొచ్చు గానీ ఒకే సమయంలో ఇలా రెండు మూడు చిత్రాల్ని లైన్ లో పెట్టడాన్ని కూడా ఆయన అభిమానులు తట్టుకోలేక పట్టరాని ఆనందంతో దండం పెట్టేస్తున్నారు. తమ కథానాయకుడు గతంలో ఎప్పుడూ ఇంత జెట్ స్పీడ్ ప్రదర్శించలేదని గుర్తుచేసుకుంటున్నారు. అంతేకాదు. ప్రభాస్ తొలిసారిగా మొత్తం బాలీవుడ్ టెక్నీషియన్లతోనే ఈ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించబోతుండటం కూడా ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఇది బిగ్ స్క్రీన్ పై మరోసారి బాహుబలి రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేయటం గ్యారెంటీ అని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు.

Prabhas : prabhas attending two movies shootings at a time
Prabhas : prabhas attending two movies shootings at a time

ఇంకేంటి?: Prabhas

‘ఆదిపురుష్’ ఆరంభం కావటంతో దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. హిందీలోని జెమ్ అనదగ్గ టెక్నీషియన్లలో ఓం రావత్ కూడా ఒకరు. ఆయన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ మూవీకి ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని, రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడని చెబుతున్నారు. వీళ్లద్దరి సెలక్షన్ అయిపోవటంతో ఇక కీలకమైన సీత పాత్రను ఎవరు పోషించబోతున్నారనే చర్చ మొదలైంది. దీనికోసం కృతి సనన్ ని ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉండే ‘ఆదిపురుష్’లోని ఇతర నటీనటుల ఎంపిక కూడా సవాల్ తో కూడుకున్నదనే చెప్పాలి. అసలు కథ ఇప్పుడే మొదలైందట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎండా కాలంలో ప్రేక్షకుల ముందుకి తెస్తారని అంటున్నారు. మరోవైపు.. ‘సలార్’ షూటింగ్ గోదావరిఖనిలోని సింగరేణి మైనింగ్ ఏరియాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement