Prabhas : ఆదిపురుష్ టీం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ శుభవార్త..

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆ హీరో నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆయన నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన సర్ ప్రైజ్ ని ఆ సినిమా యూనిట్ ఏప్రిల్ 21న విడుదల చేయబోతోంది. ఆ రోజే ఎందుకు? అంటే ఆ రోజు శ్రీరామ నవమి పండుగ. అయినా ఆ పర్వదినాన్నే సెలెక్ట్ చేసుకోవటం వెనకున్న కారణం ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండటం. అతనికి విలన్(రావణుడి)గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. మంచి మీద చెడు సాధించిన విజయాన్నే ఇతివృత్తంగా తీసుకొని ‘ఆదిపురుష్’ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ న్యూస్ బాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది.

ఫస్ట్ లుక్..

‘ఆదిపురుష్’లో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం స్పెషల్ ఎఫెక్ట్ (వీఎఫ్ఎక్స్) పనులు ప్రారంభమయ్యాయని, ప్రభాస్ లేకుండా ఇతర తారాగణంతో షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. రామాయణం అనేది మన దేశంలో ఎవ్వర్ గ్రీన్ సబ్జెక్ట్. దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నందున ‘ఆదిపురుష్’పై ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు తటస్థ అభిమానులూ భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న ఈ పిక్చర్ లో రాముడి సోదరుడు లక్ష్మణుడిగా యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సీతగా  కృతీ సనన్ ఫైనల్ అయిన విషయం తెలిసిందే.

Prabhas : block buster good news for prabhas fans
Prabhas : block buster good news for prabhas fans

తెర వెనుక: Prabhas

టీ సిరీస్ బ్యానర్ పై ఒకే సమయంలో ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో) సిద్ధమవుతున్న ‘‘ఆదిపురుష్’’కి నిర్మాతలు నలుగురు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్. ప్రభాస్ తన ఫ్యాన్స్ ని అలరించేందుకు ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పేశారు. వాటిలో రెండు సినిమాల (సలార్, ఆదిపురుష్) షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ సినిమా (రాధేశ్యామ్) విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘మహానటి’’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాలుగో మూవీ పట్టాలెక్కాల్సి ఉంది.

Advertisement