Poll : ఈ క్రింది సినిమాలలో ఏ చిత్రం ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అని మీరు అంచనా వేస్తున్నారు..?

poll-which-of-these-movies-is-the-most-hit
poll-which-of-these-movies-is-the-most-hit

Poll : 2020 సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు పెద్ద సినిమాలు లేక విపరీతమైన కరువు లో ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ లు అర్థాంతరంగా ఆగిపోయి షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. కొవిడ్ నిబంధనల నుండి మినహాయింపులు ఇచ్చిన తర్వాత నిదానంగా మిగిలిన షెడ్యూల్స్ పూర్తి చేసేశారు. ప్రస్తుతం చాలా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి… ఇక మరికొన్ని సగం షూటింగ్ జరుపుకున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ నటించిన సినిమాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి. ఒకే సంవత్సరం ప్రతీ ఒక్క స్టార్ హీరో సినిమా విడుదల కావడం అనేది ఇదే తొలిసారి కాబోలు. అయితే వీటిలో ఆర్ఆర్ఆర్ చిత్రం బడ్జెట్ పరంగా చాలా పెద్దది పైగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్లు నుండి మొదలవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం మినహాయిస్తే మిగిలిన పెద్ద హీరోలు అందరూ వచ్చిన గ్యాప్ ను మరిచిపోయేలా తమ ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ క్రింది సినిమాలలో ఏ చిత్రం ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అని మీరు అంచనా వేస్తున్నారు..?
[yop_poll id=”15″]

Advertisement