పవన్ కళ్యాణ్ రాజకీయాలకి చిరంజీవి పెద్ద అడ్డంకిగా మారాడా..?

మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే అభిమానుల్లో కనిపించే సందడి అంతా ఇంతా కాదు. తన స్వయం కృషితో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాళ్ళందరి కేరాఫ్ అడ్రెస్ ఏంటని అడిగితే అందరి నోటి వెంట వచ్చే ఒకే ఒక మాట చిరంజీవి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న గుర్తింపే వేరు. ఎన్నో లక్షల మంది అభిమానులను ఆయనకు, ఆయన కుటుంబానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరంలాగా చెప్పుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న హోదా మరెవ్వరికీ లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ కి పెద్ద దిక్కు చిరంజీవి అని చెప్పాలి.

pawan kalyan and chiranjeevi mega politics
pawan kalyan and chiranjeevi mega politics

చిరంజీవి తన జీవితంలో మొదట స్థానాన్ని సినిమా రంగానికే ఇస్తారు. కానీ, మధ్యలో ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపి, కొన్నాళ్ల పాటు సినిమాలు తీయకుండా రాజకీయాల్లోనే ఉన్నారు. అది కొన్ని రోజుల వరకే పరిమితం అని తెలుసుకుని రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. రాజకీయాలు శాశ్వతం కాదు.. ఈరోజు ఉన్న పదవి, హోదా రేపు ఉండవు. అదే సినిమా రంగం అనేది శాశ్వతం.. మనిషి చనిపోయినాగాని అభిమానుల గుండెల్లో ఎప్పటికి చెరగని ముద్రల ఉండిపోతామని గ్రహించి, మళ్ళీ సినిమా రంగం వైపు అడుగులు వేశారు మెగాస్టార్.

అయితే ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు.. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా గాని తన సొంత తమ్ముడయినా పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అన్న చిరంజీవితో పోలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలల్లో కొంచెం దూకుడుగానే ఉంటారని అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆవేశపు ప్రకటనలు, ఆయన వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తన అభిమానుల్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసాడనే చెప్పాలి. చిరంజీవితో సమానమైన హోదా సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అన్న చేసిన పొరపాట్లు తాను చేయకుండా ముందుకు సాగాలనుకుని జనసేన అనే ఒక పార్టీని కూడా స్థాపించారు. కానీ, పవన్ కళ్యాణ్ మాటలు అందరిని ఆకర్షిస్తాయి. ఆయన ఒక్కోసారి తీసుకునే ఆవేశపూరితమైన నిర్ణయాలు, సరైన ఆలోచనా విధానం లేకపోవడం వల్ల ఆయన ఆరేళ్ళుగా అలానే ఉన్నారు తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. అంతేకాదు అన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ తో అంటి అంటనట్లు ఉండడం, వేరే పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించడం వలన రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అడ్డుపడుతోందన్న వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి రాజకీయల నుంచి ఎప్పుడో తప్పుకున్నారు. ఈ వయసులో నాకు పాలిటిక్స్ ఎందుకు అని.. ఆ మధ్య ఒక మీడియా ముఖంగానే తన విముఖతను చాటుకున్నారు. అలానే ఆ పార్టీ కి మద్దతు ఇస్తా.. ఈ పార్టీకి మద్దతు ఇస్తా.. అనే మాటలు ఇప్పటిదాకా చెప్పలేదు. ఆయన ప్రస్తుతం సినీ పెద్ద అయిన దాసరి నారాయణ రావు మరణం తరువాత, ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి గాను టాలీవుడ్ లో అందరికి ఒక పెద్ద దిక్కుగా మారిపోయారు.. కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీతో పాటు సినీ కళాకారులు కూడా ఆర్ధికంగా ఎంతగానో నష్టపోయారు. అందుకని ఆయన సినీ రంగానికి సంబంధించిన సమస్యలను ఇద్దరు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రుల వద్ద తరచూ ప్రస్తావిస్తున్నారు. ఆ క్రమంలో చిరంజీవికి ఆ నేతల పట్ల మంచి అభిప్రాయం ఉందన్న ప్రచారం కూడా మరో వైపు జరిగిపోతోంది. అయితే ఈ ప్రచారమే జనసేనాని పవన్ కు తలనొప్పిగా మారిందట. పవన్ కళ్యాణ్ రాజకీయంగా విభేదిస్తున్న నేతలను స్వయానా తన అన్న కలవడం వల్ల పవన్ ప్రయత్నాలు సజావుగా సాగడం లేదని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇలా భావించడంలో తప్పులేదు. అంతేకాదు అప్పట్లో మెగాస్టార్ తరచూ కేసీఆర్ తో భేటీ అవుతూ సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావనకు తెస్తున్నారు.

కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణాలో బీజేపీతో కలసి కేసీఆర్ మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా తన అన్న, కేసీఆర్ ను పదే పదే కలవడం ఇబ్బందిగా ఉంటుందట. మరో వైపు ఏపీ సీఎం జగన్ ని ఇప్పటికి రెండు సార్లు కలసిన చిరంజీవి మరో మారు కలిసేందుకు రెడీ అవుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. సినీ రంగం సమస్యల మీదనే మెగాస్టార్, జగన్ తో భేటీ అవుతున్నారు. కానీ, చిరంజీవి జగన్ పక్షమని వైసీపీ పార్టీ అభ్యర్థులు దాన్ని ప్రచారంగా మార్చుకునే అవకాశమూ కూడా లేకపోలేదు. అలాగని చిరంజీవిని తప్పుపట్టడానికి లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికీ లేదు. కానీ, ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. జనసేనలో ఉన్నది కూడా ఎక్కువగా మెగా ఫ్యాన్సే. ఒక మరలో రెండు కత్తులు ఇమడవు అని మెగా బ్రదర్స్ ను చూస్తే అర్ధం అవుతుంది.

Advertisement