TANA : ఏక్ నిరంజన్ కాదు.. టీమ్ నిరంజన్.. ఓన్ ఎలక్షన్..

TANA: ఉత్తర అమెరికాలోని అతి పురాతన, అతి పెద్ద ఇండో అమెరికన్ ఆర్గనైజేషన్ అయిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-TANA) ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు టీమ్ భారీ విజయం సాధించింది. దీంతో తానాకి కొత్త ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నిరంజన్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ ఎలక్షన్ లో నిరంజన్ కి 10,866 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి నరేన్ కొడాలి 9,108 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఫలితంగా నిరంజన్ 1,758 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. దీంతో ఆయన ప్యానెల్ సభ్యులు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

TANA

వన్ మ్యాన్ ఆర్మీ..

‘‘నా జీవితం నా కోసం కాదు.. తానా కోసం’’ అని మనస్ఫూర్తిగా చెప్పే నిరంజన్ శృంగవరపుని ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా అభివర్ణించొచ్చు. ఒకప్పుడు ఒకే ఒక్క పర్సన్ గా ఏక్ నిరంజన్ లెవల్లో ఉన్న ఆయన ఇప్పుడు పవర్ ఫుల్ టీమ్ నిరంజన్ స్థాయికి చేరుకున్నారు. స్వయంకృషితో, ఎందరో మహానుభావుల సహకారంతో వ్యక్తిగా, వ్యవస్థగా, శక్తివంతమైన సంస్థగా ఎదిగారు. ఆంధ్రా నుంచి అగ్ర రాజ్యం వరకు సాగిన ఆయన ప్రయాణం అడుగడుగునా ఆదర్శప్రాయం. నిరంజన్ 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా ఏరోజూ తాను పుట్టి పెరిగిన దేశాన్ని, ప్రదేశాన్ని మర్చిపోలేదు. అందుకే తానాలో తానూ ఒక సభ్యుడిగా చేరారు. తర్వాత పలు పదవుల్లో తనదైన శైలిలో సాటి తెలుగువారి కోసం సాటిలేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. తర, తమ భేదాలు చూపకుండా ప్రతిఒక్కరితో కలిసిమెలిసి మచ్చలేని మనిషిగా పనిచేశారు. ‘అందరివాడు’ అనిపించుకున్నారు. తాను ఉన్నది తానా కోసం తానా ఉన్నది మార్పు కోసమని చెప్పారు. ఏపీ, తెలంగాణ, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అందరి కోసం మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తానా ఎప్పుడూ ఒకే కుటుంబంలా ఒకే లక్ష్య సాధన కోసం శ్రమిస్తుందని నిబద్ధత కలిగిన నాయకుడిగా మాటిచ్చారు.

TANA

రాజా నగరం టు రాజధాని..

నిరంజన్ గురించి తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. అయినా ఆయన వ్యక్తిగత, వృత్తిగత విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా బోర్ కొట్టవు. ఇన్ స్పిరేషన ల్ గా అనిపిస్తాయి. నిరంజన్ ఏపీలోని కర్నూల్ జిల్లా రాజా నగరం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ని సొంతూరులో, హైస్కూల్ స్టడీని ఎర్రగుంట్లలో పూర్తి చేశారు. ప్రాథమిక విద్యలో ప్రతిభ కనబరిచి పైచదువుల కోసం పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీని కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం కోసం రాజా నగరం కుర్రాడిగా రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి చేరుకున్నారు. అవకాశం రావటమే ఆలస్యం అన్నట్లు ఆకాశమే హద్దుగా అందిపుచ్చుకున్నారు. 2000 సంవత్సరంలో అమెరికా వచ్చి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐబీఎం సంస్థలో ఎంప్లాయ్ గా జాయినయ్యారు. అతికొద్ది కాలంలోనే అద్భుతమైన అనుభవం సంపాదించి 2003లో బైటెక్ ఇంక్ అనే సొంత ఐటీ కంపెనీని స్థాపించారు. తాను స్థిరపడ్డాక తనలాంటి మరెంతో మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో అత్యన్నత హోదాల్లో కొనసాగుతున్నారు. తనకే సొంతమైన వ్యక్తిత్వంతో ఆ హోదాలకు తరగని వన్నె తెస్తున్నారు.

TANA

తాను.. తానా..

నిరంజన్ తొలిసారిగా 2009లో ‘తానా’లో చేరారు. ఈ కమ్యూనిటీలో చిన్న, పెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని పదవులూ ఆయన్ని వరించాయి. దీన్నిబట్టి నిరంజన్ లోని లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఆయన తానా తరఫున వందల సంఖ్యలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్షల్లో విరాళాలు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. తన కుమారుడు సర్వేశా పేరిట ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి బడుగుల బాగు కోసం పాటుపడుతున్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, క్యాన్సర్ అవేర్ నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి కరుణా కటాక్షంలేని నిరుపేద విద్యార్థులకు సాక్షాత్తూ సరస్వతీ దేవి పుత్రుడిలా స్కాలర్ షిప్పులు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. చేయూత, ఆదరణ వంటి ప్రత్యేక కార్యక్రమాలెన్నో ప్రారంభించారు. కరోనా వైరస్ సమయంలో నిరంజన్ ఆధ్వర్యంలో తానా చేపట్టిన ప్రోగ్రామ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలువ కట్టలేని నిత్యవసర సరుకుల బ్యాగులు, మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

TANA

తెలుగువారికి.. చెరగని చిరునామా..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తానా ఫౌండేషన్ చెరగని చిరునామాగా కలకాలం నిలిచి ఉండాలనేది నిరంజన్ జీవితాశయం. అందుకే ఈ నెలలో జరిగిన తానా సంస్థాగత ఎన్నికల్లో రెండేళ్ల కాల పరిమితి ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇద్దరితో పోటీపడ్డారు. నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తన టీమ్ ని ‘‘విజయీభవ’’ అంటూ దీవించాలని కోరుకున్నారు. వినయానికి-విశ్వసనీయతకి పట్టం కట్టాలని, అనుభవానికి-సమర్థతకి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తగ్గట్లే ఓటర్లు ‘‘గ్రేట్ నిరంజన్.. ఓట్ నిరంజన్..’’ అంటూ ఒకే మాట మీద నిలబడి ఆయన టీమ్ ని గెలిపించారు.

TANA