Mukhachitram Movie Review : ‘ముఖచిత్రం’ రివ్యూ: లోపలి పేజీల్లో స్టఫ్ సరిగ్గా కుదరలేదు.!
NQ Staff - December 9, 2022 / 10:23 AM IST

Mukhachitram Movie Review : ‘కలర్ ఫొటో’ సినిమాకిగాను జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ కథతో తెరకెక్కిన ‘ముఖచిత్రం’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ సంపాదించగలిగింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాపై హైప్‌ని మరింత పెంచింది. ఇంతకీ, ఈ సినిమా కథ, కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక..
కథేంటంటే..
ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజ్‌కుమార్ (వికాస్ వశిష్ట), మహతి (ప్రియ వడ్లమాని)ని పెళ్ళాడతాడు. పెళ్ళయ్యాక కొన్ని నెలల తర్వాత ఆమె చనిపోతుంది. తన భార్యని మర్చిపోలేకపోతున్న డాక్టర్ రాజ్ కుమార్, తన స్నేహితురాలు మాయ (అయేషా ఖాన్) మొహానికి, తన భార్యలా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. మాయ ఎవరు.? ఆమె గతం ఏంటి.. మాయ ఒరిజినల్ ఫేస్‌ని మహతి ఫేస్‌లా మార్చడం వెనుక డాక్టర్ రాజ్‌కుమార్ అసలు కోణమేంటి.? అవన్నీ తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
వికాస్ వశిష్ట కొత్తవాడే అయినా పరిణతి చెందిన నటుడిలా కనిపిస్తాడు. డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్.. అన్నిటిలోనూ చాలా బాగా చేశాడు. తన పాత్రలో మల్టీ డైమన్షన్స్ చూపించేందుకు ప్రయత్నించాడు, ఈ క్రమంలో కొంతమేర విజయం సాధించాడు కూడా.
హీరోయిన్లలో ప్రియ వడ్లమాని చాలా బాగా చేసింది. అయేషా ఖాన్ ఓకే. యువ హీరో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో మెరిశాడు. న్యాయవాది పాత్రలో రవిశంకర్ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
సాంకేతికవర్గం పనితీరు..
సాంకేతిక వర్గం విషయానికొస్తే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. పాటలు బాగానే వున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది.
ప్లస్ పాయింట్స్
లీడ్ పెయిర్
కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్

Mukhachitram Movie Review
కాన్సెప్ట్ బావున్నా, సన్నివేశాలు సరిగ్గా కుదరకపోవడం
కొంతమేర సాగతీత
విశ్లేషణ
హాలీవుడ్ సినిమా ‘ఫేస్ ఆఫ్’, టాలీవుడ్ సినిమా ‘ఎవడు’.. ఇలా చాలా కథలే వచ్చాయ్.. ప్లాస్టిక్ సర్జరీతో మొహాలు మార్చేయడం అనే కాన్సెప్టుతో. ఇక్కడా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గానే వున్నా, ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేయలేకపోయాడు దర్శకుడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాగానీ, మెజార్టీ బోర్ కొట్టించేస్తాయి. లీడ్ పెయిర్ నుంచి మంచి సపోర్ట్ లభించినాగానీ, దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
రేటింగ్: 1.5/5