MP : బ్రేకింగ్ న్యూస్ : పార్లమెంట్ సభ్యుడి ఆత్మహత్య? ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు ఎంపీ..

MP : మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపీ) మోహన్ దేల్కర్ ఇవాళ (సోమవారం) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సౌత్ ముంబైలోని ఒక హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మోహన్ దేల్కర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. ఆయన డయ్యూ డామన్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలోని దాద్రా అండ్ నగర్ హవేలి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సెగ్మెంట్ కి గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు.

MP : member of parliament (mp) suicide
MP : member of parliament (mp) suicide

నోట్: MP

2019లో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన మోహన్ దేల్కర్ అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలుపొందారు. దాద్రా అండ్ నగర్ హవేలీ నుంచి ఆయన విజయం సాధించటం ఇది ఏడో సారి కావటం విశేషం. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన బలన్మరణం చెందినట్లు భావిస్తున్న హోటల్ లో గుజరాతీ భాషలో రాసి ఉన్న సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement