ఈ 13 మంది కన్నుమూసాక వారు నటించిన సినిమాలు విడుదలయ్యాయి తెలుసా..?

Mamatha 600 - January 1, 2021 / 08:46 PM IST

ఈ 13 మంది కన్నుమూసాక వారు నటించిన సినిమాలు విడుదలయ్యాయి తెలుసా..?

మనం ఎంతగానో ప్రేమించే నటులు మరణిస్తే మనకి చాలా బాధ కలుగుతుంది. ఆ బాధ నుండి తేరుకోడానికి చాలా సమయమే పడుతుంది. అలా కొందరు చనిపోయిన తర్వాత వాళ్ళ చివరి సినిమాలు విడుదలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.

stars-1

తన మరణంతో అందరిని ఆశ్చర్య పరిచిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ మరణించాడు. ఆయన చనిపోయిన జులై 24న ఈయన చివరి సినిమా దిల్ బెచారా విడుదలైంది. ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మరో సీనియర్ నటుడు ఆక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన ఐదు నెలల తర్వాత మనం చిత్రం విడుదలైంది. జనవరి 22, 2014న ఏఎన్నార్ చనిపోతే. మేలో మనం విడుదలైంది. అలనాటి హీరోయిన్ సౌందర్య ఒక హెలికాప్టర్ క్రాష్‌లో దుర్మరణం పాలైంది. ఆలా సౌందర్య చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర, మోహన్ బాబు శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి. మరో టాలీవుడ్ నటి కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. ఈమె 1993లో చనిపోయింది. అప్పటికే ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఆలా దివ్య భారతి మరణానంతరం హిందీలో రంగ్, శత్రంజ్. తెలుగులో తొలి ముద్దు సినిమాలు విడుదలయ్యాయి. ఇక 2002లో వర్ధమాన నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇప్పటికీ ఈమె మరణం మిస్టరీనే నిలిచింది. అయితే ఈమె చనిపోయిన తర్వాత ఆమె చివరి చిత్రం సౌండ్ పార్టీ విడుదలైంది.

కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం చెందాడు 2013 అక్టోబర్ 9న శ్రీహరి చనిపోతే. ఆయన మరణానంతరం రాంబో రాజ్‌కుమార్ విడుదలైంది. తెలుగులో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి.

ఇక యాక్షన్ కింగ్ బ్రూస్‌లీ చనిపోయిన తర్వాత కూడా ఆయన సినిమాలు వచ్చాయి. అందులో గేమ్ ఆఫ్ డెత్ ఒకటి. ఇది కూడా సంచలన విజయం సాధించింది. 2015లో లైపో ఫెయిల్ కావడంతో ఆర్తి అగర్వాల్ చనిపోయింది. ఆమె మరణించిన తర్వాత ఆమె ఎవరు అనే సినిమా విడుదలైంది. పలు తెలుగు సినెమాలలోనటించిన నటుడు అచ్యుత్. అలాంటి ఈయన 2002లో కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత ఒక్కడు సినిమా విడుదలైంది. తెలుగులో అతి తక్కువ సమయంలో 700 సినిమాలు పూర్తి చేసిన హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈయన 2015, జనవరి 23న చనిపోయాడు. ఎమ్మెస్ చనిపోయిన నాలుగు నెలల తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, లయన్ లాంటి సినిమాలు విడుదలయ్యాయి. తనదైన కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ధర్మవరపు సుబ్రమణ్యం. ఈయన 2013, డిసెంబర్ 7న చనిపోయాడు. ఈయన మరణించిన తర్వాత అమృతంలో చందమామ, రుద్రమదేవి లాంటి సినిమాలు విడుదలయ్యాయి. బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు యశ్ చోప్రా చివరి సినిమా జబ్ తక్ హై జాన్ ఆయన చనిపోయిన తర్వాత విడుదలైంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us