Love Today Movie Review : ‘లవ్ టుడే’ రివ్యూ : యువతను ఆకట్టుకునేలా.. ఆలోచింపజేసేలా.!
NQ Staff - November 25, 2022 / 06:44 AM IST

Love Today Movie Review : ప్రేమకథలు చాలా వస్తుంటాయ్.. వాటిల్లో కంటెంట్ వున్న కథలు ఆకట్టుకుంటాయ్.. కంటెంట్ లేని కథలు ఔట్ అయిపోతుంటాయ్. ‘లవ్ టుడే’ అనే సినిమా గురించి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘లవ్ టుడే’ కాస్త లేటుగా తెలుగులోకి డబ్ అయ్యి, నేడే విడుదలయ్యింది. ఇంతకీ, ఈ సినిమా కథ.. కమామిషు ఏంటి.?
కథేంటంటే..
అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ ప్రేమని అంగీకరించాలంటే దానికో కండిషన్ పెడతాడు అమ్మాయి తండ్రి. అమ్మాయి, అబ్బాయి.. తమ తమ ఫోన్లను ఇరవై నాలుగ్గంటలపాటు మార్చుకోవాలి. అంటే, ఒకరి ఫోన్ ఇంకొకరి దగ్గర వుంచుకోవాలన్నమాట. ఇరవై నాలుగ్గంటల తర్వాత కూడా ఇద్దరి మధ్యా ప్రేమ అలాగే వుంటే, వారి పెళ్ళికి అంగీకరిస్తానంటాడు ఆ తండ్రి. ఇంతకీ, ఈ ఇరవై నాలుగ్గంటల్లో ఏం జరిగింది.? ఆ తర్వాత పరిస్థితేంటి.? అది తెరపై చూస్తేనే బావుంటుంది.
నటీనటుల పనితీరు..
హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకుడు కూడా. మంచి నటనను ప్రదర్శించాడు. సాధారణంగా దర్శకత్వం, నటన.. రెండూ అంటే, ఒత్తిడి వుంటుంది. ఆ ప్రభావం ఏమీ లేదు. చాలా తేలిగ్గా చేసుకుంటూ పోయాడు.
ఇవానా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రదీప్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండించింది.
మిగతా పాత్రధారుల్లో సీనియర్ నటులు సత్యరాజ్, రాధిక తమ అనుభవాన్ని రంగరించి, ఆయా సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేలా చేయగలిగారు.
సాంకేతికవర్గం పనితీరు..
యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ అన్నీ బావున్నాయ్.
ప్లస్ పాయింట్స్
కాన్సెప్ట్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
లీడ్ పెయిర్ నటన
కామెడీ

Love Today Movie Review
మైనస్ పాయింట్స్
సెకెండాఫ్‌లో వేగం తగ్గడం
విశ్లేషణ
ఈ జనరేషన్ యువతరానికి బాగా కనెక్ట్ అయ్యేలా పాత్రల్ని దర్శకుడు డిజైన్ చేశాడు. హ్యూమర్ విషయంలో దర్శకుడ్ని అభినందించి తీరాలి. సెకెండాఫ్‌లో కొంత వేగం తగ్గుతుంది. ఇంకాస్త బెటర్‌గా సెకెండాఫ్‌ని డీల్ చేసి వుంటే, ఈ సినిమాకి మరింతగా ప్రశంసలు దక్కి వుండేవి. సాంకేతిక నిపుణుల్ని సరిగ్గా వాడుకున్నాడు దర్శకుడు.
తానే దర్శకత్వం వహించి, తానే హీరోగా నటించినా, పెద్దగా తడబడలేదు. టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్‌ని థియేటర్లకు రప్పించే కంటెంట్‌తో దర్శకుడు మంచి మార్కులేయించేసుకున్నాడు.
రేటింగ్: 3/5