Lalitha Jewellery : ల‌లిత జ్యువెల‌రీ అస‌లు ఓన‌ర్ కిర‌ణ్ కుమార్ కాదా…!

Sravani Journalist - August 16, 2022 / 09:38 AM IST

151548Lalitha Jewellery  : ల‌లిత జ్యువెల‌రీ అస‌లు ఓన‌ర్ కిర‌ణ్ కుమార్ కాదా…!

Lalitha Jewellery  : ల‌లిత జ్యువెల‌ర్స్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే పేరు కిర‌ణ్ కుమార్. త‌న కంపెనీకి ఆయ‌న ప్ర‌చారం చేసుకున్న విధానం అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని.. తల్లకిందులు చేసిన తెలివైన బిజినెస్‌మెన్ కిరణ్ కుమార్. లలిత జ్యూవెలర్స్‌ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ గా కిరణ్‌ కుమార్‌ మారిపోయారు.

అస‌లు విష‌యం ఏంటంటే..

హైద‌రాబాద్‌లో మూడు షోరూంలు ఓపెన్ చేయ‌గా, ముందుగా సోమాజిగూడ‌లో ఆ త‌ర్వాత కూక‌ట్ ప‌ల్లి, అనంత‌రం దిల్‌షుక్ న‌గ‌ర్‌లో ఓపెన్ చేశారు. త్వ‌ర‌లో చందాన‌గ‌ర్‌, సుచిత్ర స‌ర్కిల్‌లో ఓపెన్ చేయ‌బోతున్నాం అని కిర‌ణ్ చెప్పుకొచ్చారు. నిజ‌మాబాద్‌లో కూడా ఓ షోరూం ప్లాన్ చేయ‌బోతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story

Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story

ల‌లితా జ్యువెల‌రీలో ల‌లితా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింద‌ని ప్రశ్నించ‌గా, దానికి సమాధానం ఇచ్చిన ఆయ‌న 1999లో ల‌లితా జ్యువెల‌రీని నేను టెకోవ‌ర్ చేశాను అని తెలిపారు. నేను ఒరిజిన‌ల్ ఓన‌ర్‌ని కాదు. కంద‌స్వామి అనే అత‌ను ఒరిజిన‌ల్ ఓన‌ర్. అత‌న‌ని నుండి తాను టేకొవ‌ర్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఇక ల‌లిత జ్యువ‌ల‌రీస్ అంటే జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన‌వ‌ని రూమర్స్ వ‌చ్చేవి, దానిపై ఏమ‌ని అంటారు అని ప్ర‌శ్నించ‌గా, ఎవ‌రేమైన అనుకోని అని ఆయ‌న అన్నారు.

సోనియా అంటే సోనియా గాంధీది అనే వారు.మోదీ జ్యువెల‌రీస్ అంటే న‌రేంద్ర మోదీ అని అనుకునేవారు మ‌న‌కు పొలిటీష‌న్స్ ఎవ‌రితో కూడా సంబంధం లేదు అని అన్నారు. ఇక తాను ఫ‌స్ట్ షోరూం ఆంధ్రా నుండి మొద‌లు పెట్టాను అని చెప్పుకొచ్చారు.ఇప్ప‌టికి 42 ఉన్నాయి. త్వ‌ర‌లో 180 షోరూంస్ ప్లాన్ చేస్తున్నాను. నార్త్‌లో కూడా ఆలోచ‌న ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 450 షోరూంస్ పెట్టే ప్లాన్ ఉంది. మూడు నాలుగేళ్ల‌లో అది పూర్తి చేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు.