KTR : కాబోయే ముఖ్యమంత్రి.. కాబోయే ఒలింపిక్ మెడలిస్ట్..

KTR : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఓ కుర్రాడి ట్యాలెంట్ చూసి అతణ్ని ‘కాబోయే ఒలింపిక్ మెడలిస్ట్’ అని అభివర్ణించారు. ఆ అబ్బాయి పేరేంటో, ఊరేంటో ఇంకా తెలియరాలేదు. కానీ.. అతడిలోని ప్రతిభ మాత్రం క్షణాల్లోనే ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ రోజు (ఆదివారం) ట్విట్టర్ లో వచ్చిన ఓ పిల్లోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చూసిన ప్రతిఒక్కరూ వహ్వా అంటున్నారు. ఆ లిస్టులో మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు.

పిట్ట కొంచెం..

‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే మాట వినే ఉంటారు. ఇప్పుడు దాన్ని ఈ వీడియోలో చూడండి. ‘పిల్లోడు కొంచెం.. గెంతేతి ఘనం’ అని అనకమానరు. తోటి పిల్లలతో కలిసి ఆడుకునే చిన్న వయసులో ఈ వండర్ కిడ్ చేస్తున్న విన్యాసాలు తెలంగాణ మంత్రి కేటీఆర్ ని సైతం మంత్రముగ్ధుణ్ని చేశాయి. దీంతో ఈ కాబోయే సీఎం ఈ వీడియో చూసి వెంటనే స్పందించారు. ‘‘వావ్.. యాన్ ఒలింపిక్ మెడలిస్ట్ ఇన్ ది మేకింగ్’’ అంటూ కామెంట్ కూడా పెట్టారు. ‘‘అతను తెలంగాణ బుడతడేనా? లేక దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందినవాడా?’’ అంటూ వాకబు చేశారు. అతని అమేజింగ్ ట్యాలెంట్ కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

వెలుగులోకి ఎలా?: KTR

ఈ వీడియోని మొదట పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చాడు. ‘‘వావ్.. అసలు సిసలు ప్రతిభ అంటే ఇదే. ఫిజికల్ ఫిట్ నెస్ సాధనకు మోటివేషన్. ఈ రోజు ఆదివారం. శారీరక ఆరోగ్యంపై ఫోకస్ పెట్టడానికి తీరిక సమయం దొరికే రోజు. ఈ కుర్రాణ్ని ఆదర్శంగా తీసుకొని నేనూ ఒళ్లు వంచుతా’’ అని కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను ట్యాగ్ చేశాడు.

KTR-reaction-on-a-young-boy-video
KTR-reaction-on-a-young-boy-video

స్పోర్ట్స్ మినిస్టర్..

వి.శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్. ఈ పిల్లోడిలోని ట్యాలెంట్ కి మరింత పదును పెట్టేందుకు క్రీడల శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడే సరైన వ్యక్తి అనుకొని ఆయన్ని విష్ణువర్ధన్ రెడ్డి ట్యాగ్ చేసి ఉంటారు. కేటీఆర్ రియాక్ట్ అయ్యారు గానీ ఇంకా శ్రీనివాస్ గౌడే స్పందించలేదు. ఈరోజు సాయంత్రం కల్లా ఆ బుడ్డోడి పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని భావిస్తున్నారు.

Advertisement