KTR : కే‌సీ‌ఆర్ కుర్చీ కే‌టీ‌ఆర్ ఎక్కుతాడా లేదా – మరొక పెద్ద సీక్రెట్ తెలిసింది?

KTR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రి కేటీఆర్ ఎప్పుడు కూర్చుంటారు?. ఈ ప్రశ్న ఎలా ఉందంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో బాహుబలి-2 బొమ్మ విడుదలయ్యేదాక కూడా హీరోకి, దర్శక నిర్మాతలకు తప్ప మరెవరికీ తెలియదనుకుంటా. అలాగే.. సీఎం కేసీఆర్ ప్లేసులోకి కేటీఆర్ ఎప్పుడు వస్తారనేది కూడా వాళ్లిద్దరికి తప్ప మూడో కంటోడికి తెలియనట్లే ఉంది. సినిమాల ప్రచారం, ప్రమోషన్ కోసం టీజర్లు, ట్రైలర్లు, గ్లింప్సేలు గట్రా విడుదల చేస్తున్నట్లే ఈ ‘సినిమా’కి కూడా ఆ టైపులోనే క్యాన్వాస్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పిన మాటలైతే కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇందులో ఏదో మర్మం (పెద్ద సీక్రెట్) దాగున్నట్లే అనిపిస్తోంది.

దేవుడెందుకు?..

దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు సహజంగా ‘అంతా ఆ భగవంతుడి దయ’ అంటుంటారు. అయితే.. కేటీఆర్ ముఖ్యమంత్రి కావటానికి దేవుడి దయ అంతగా అవసరంలేదేమో, కేసీఆర్ ఎప్పుడు ‘ఊ’ అంటే అప్పుడే అయిపోతుంది కదా అనిపిస్తోంది. బొంతు రామ్మోహన్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘భగవంతుని కృపతో సరైన సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారు’’ అన్నారు. ఇది తన పర్సనల్ ఒపీనియన్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతలోనే మళ్లీ టీఆరెస్ సమిష్టి నిర్ణయంతోనే ఇది జరుగుతుందంటూ పార్టీ ప్రస్తావన తెచ్చారు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పేటప్పుడు పార్టీ పేరెత్తడం దేనికో ఆయనకే తెలియాలి.

KTR : question on minister ktr promotion as cm
KTR : question on minister ktr promotion as cm

మీకు మీరే?: KTR

మొన్న ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన పార్టీ ప్రోగ్రామ్ లో తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ కూడా ‘‘కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం తప్పని ఇప్పటివరకు టీఆరెస్ వాళ్లైతే ఎవరూ అనలేదు. ఒకవేళ బయటివాళ్లు ఒకరిద్దరు అన్నా ఎవరూ పట్టించుకోరు. వాళ్ల అభిప్రాయానికి విలువ కూడా ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా అధికార పార్టీ అంతర్గత వ్యవహారం. ఇదంతా తెలిసి కూడా తప్పేంటి తప్పేంటి అంటూ పదే పదే వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకోవటం హాస్యాస్పదంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుందనే సెటైర్లు కూడా వస్తున్నాయి. కేటీఆర్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కూడా అలీ అన్నారు. అంటే మిగతావాళ్లు నిరంతరం కాకుండా పార్ట్ టైమ్ మాత్రమే కష్టపడుతున్నారా అని జోకులు పేలుతున్నాయి.

Advertisement