KTR : కేటీఆర్ సీఎం కావటం తప్పే..

KTR : ‘కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’ అని టీఆరెస్ నాయకులు, మంత్రులు పదే పదే ప్రశ్నిస్తున్నారు కదా. ఆ ప్రశ్నకి ఎట్టకేలకు సమాధానం దొరికింది. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం తప్పేనని ఓ నాయకుడు తేల్చిపారేశాడు. అయితే ఆ లీడర్ అధికార పార్టీవాడు కాకపోవటం గమనార్హం. ఇంతకీ ఎవరతను అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పెద్దాయన కేసీఆర్ ని అప్పుడే కుర్చీ నుంచి తొలగిస్తారా? అంటూ ప్రశ్నకు ప్రశ్ననే సమాధానంగా చెప్పాడు. అయినా.. కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యాక కేటీఆర్ గురించి ఆలోచించొచ్చు కదా అని సెటైర్ కూడా వేశాడు. కానీ.. ఇది సీరియస్ గా మాత్రం కాదండోయ్. ఏదో సరదాకి అలా అన్నాడు.

ఎవరితో?..

కాంగ్రెస్ జీవన్ రెడ్డి టీఆరెస్ జీవన్ రెడ్డితో నిన్న (బుధవారం) ఇలా పిచ్చాపాటిగా మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య జరిగిన ఈ సంభాషణకు అసెంబ్లీ ఆవరణ వేదిక కావటం విశేషం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసన సభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి.. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్ కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఆఫీసు అసెంబ్లీ కాంపౌండ్ లోని సీఎల్పీ కార్యాలయానికి పక్కనే ఉంటుంది. సీఎల్పీ ఆఫీసుకి వెళుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీ తాగటానికి రమ్మని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పైన చెప్పుకున్న చిట్ చాట్ చోటుచేసుకుంది.

KTR : ktr cm is not correct at this early time
KTR : ktr cm is not correct at this early time

ఇలా చేశారు: KTR

తనను తేనీరు తాగటానికి పిలిచిన టీఆర్ఎస్ జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ జీవన్ రెడ్డి ‘‘మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు?’’ అని జోక్ గా అడిగారు. దానికి ఆయన ‘‘ఏదో మీ అభిమానం అన్నా’’ అంటూ ఆన్సర్ చెప్పకుండా అసలు విషయం దాటేశారు. పైగా.. కాంగ్రెస్ లో ఉన్న జీవన్ రెడ్డి (అంటే మీరు) టీఆర్ఎస్ లోకి రాకపోవటంతో నన్నిలా తయారు చేశారంటూ నవ్వుతూ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొన్నామధ్య కూడా వార్తల్లో నిలిచారు. ఆయన్ని టీపీసీసీ చీఫ్ ని చేయబోతున్నారంటూ ఒక రోజు విపరీతంగా ప్రచారం జరిగిన విషయం విధితమే.

Advertisement